Immigration Policy: డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాలు, సూచనలు మాకు ఏ మాత్రం అవసరం లేదు: వైట్‌ హౌస్‌

|

Mar 07, 2021 | 4:51 AM

Immigration Policy: ఇమ్మిగ్రేషన్‌ పాలసీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాలు, సూచనలను తాము తీసుకోబోమని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకి స్పష్టం చేశారు...

Immigration Policy: డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాలు, సూచనలు మాకు ఏ మాత్రం అవసరం లేదు: వైట్‌ హౌస్‌
Follow us on

Immigration Policy: ఇమ్మిగ్రేషన్‌ పాలసీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాలు, సూచనలను తాము తీసుకోబోమని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకి స్పష్టం చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఇమ్మిగ్రేషన్‌ విధానాలు అవమానకరమైనవని ఆయన, అవి ఉపయోగంలో లేవని అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఇమ్మిగ్రేషన్ అజెండాను వ్యతిరేకిస్తూ ట్రంప్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనపై స్పందిస్తూ జెన్ సాకి ట్రంప్‌పై పలు విమర్శలు చేశారు. జో బైడెన్‌ ఇమ్మిగ్రేషన్‌ విధానాల వల్ల దక్షిణ సరిహద్దులో వలసలు పెరిగిపోయాని ట్రంప్‌ తన లేఖలో చెప్పుకొచ్చారు. తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను బైడెన్ వెనక్కు తీసుకోవడం వల్ల సరిహద్దులో సంక్షోభానికి దారితీసిందని డొనాల్డ్‌ ట్రంప్ అన్నారు.

కాగా, ఇమ్మిగ్రేషన్‌ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను జెన్‌సాకి స్వాగతించారు. తాము తమ స్వంత మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని జెన్‌ సాకి తెలిపారు. వలసదారుల పిల్లల విషయంలో మానవత్వంతో, గౌరవంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. వలసదారుల పిల్లలు సరిహద్దులను దాటినప్పుడు వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్‌ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నామని, అమ్మిగ్రేషన్‌ విషయంలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యాలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆయన ఇచ్చే సలహాలు ఏ మాత్రం అవసరం లేదని స్పష్టం చేశారు.

ట్రంప్‌పై కోర్టులో దావా..

అలాగే ట్రంప్‌నకు వ్యతిరేకంగా కోర్టులో దావా దాఖలైంది. జనవరి 6న కేపిటల్‌ భవనం వద్ద జరిగిన అల్లర్లను ట్రంప్‌ ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు ఎరిక్‌ స్వాల్‌వెల్‌ వాషింగ్టన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌, అతని కొడుకు డొనాల్డ్‌ జూనియర్‌, లాయర్‌ రూడీ గియులియాని తదితరులు అబద్దాలను ప్రచారం చేశారని, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే కేపిటల్ భవనం వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఎరిక్ స్వాల్‌వెల్ తన పిటిషన్‌లో ఆరోపించారు.

ఇదిలా ఉండగా, యూఎస్ కాంగ్రెస్ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు జనవరి 6న కేపిటల్ భవనంలో సమావేశమైంది. ఈ సందర్భంగా వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనం వద్ద పెద్ద రాద్దంతం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల వల్ల దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ట్రంపే ప్రోత్సహించారని ఆరోపిస్తూ.. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఓ చట్టసభ సభ్యుడు గత నెలలో ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా అదే పార్టీకి చెందిన మరో సభ్యుడు వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ‌కోర్టులో దావా వేశారు.

ఇవీ చదవండి:

హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపై చైనా పెత్తనం ! ఆగ్రహించిన అమెరికా, సహించబోమని వార్నింగ్

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!