మళ్ళీ హెచ్-1 బీ వీసాలపై ‘పడిన’ ట్రంప్, ఇండియాకు దెబ్బ !

| Edited By: Pardhasaradhi Peri

Aug 04, 2020 | 2:36 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ హెచ్-1 బీ వీసాలపై 'పడ్డారు'. తమ దేశంలో అమెరికన్లకే ఉద్యోగావకాశాలు అన్న నినాదాన్ని ఎత్తుకున్న ఆయన.. ఫెడరల్ ఏజన్సీలు ముఖ్యంగా హెచ్-1 బీ వీసా హోల్డర్లను నియమించుకోకుండా నిరోధించడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.

మళ్ళీ హెచ్-1 బీ వీసాలపై పడిన ట్రంప్, ఇండియాకు దెబ్బ !
Follow us on

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ హెచ్-1 బీ వీసాలపై ‘పడ్డారు’. తమ దేశంలో అమెరికన్లకే ఉద్యోగావకాశాలు అన్న నినాదాన్ని ఎత్తుకున్న ఆయన.. ఫెడరల్ ఏజన్సీలు ముఖ్యంగా హెచ్-1 బీ వీసా హోల్డర్లను నియమించుకోకుండా నిరోధించడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది  ప్రధానంగా భారతీయ ఐటీ రంగానికి దెబ్బే !ఫెడరల్ ప్రభుత్వం అమెరికన్లను మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకునేలా ఈ ఆర్డర్ పై సంతకం చేస్తున్నానని ట్రంప్ అంతకుముందు వైట్ హౌస్ లో ప్రకటించారు.

ఈ సంవత్సరాంతం వరకు హెచ్-1 బీ వీసాలతోబాటు అన్ని రకాల విదేశీ వర్క్ వీసాలను సస్పెండ్ (రద్దు) చేస్తూ గత జూన్ 23న ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘కష్టపడి పనిచేసే అమెరికన్ల’ స్థానే ‘చౌక’గా పనిచేసే విదేశీ సిబ్బందిని తాము అనుమతించబోమని ట్రంప్ అంటున్నారు. హెచ్-1 బీ అన్నదానిని అత్యున్నత నైపుణ్యం ఉన్న సిబ్బందికే వర్తింపజేస్తామన్నారు.