కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతుందా ? హవ్వ ! ట్రంప్ ఎద్దేవా

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీ కమలా హారిస్  ఈ దేశ తొలి మహిళా అధ్యక్షురాలైతే అంతకన్నా అవమానం మరొకటి ఉండదన్నారు అధ్యక్షుడు ట్రంప్. ఆమెను దేశంలో ఎవరూ ఇష్టపడరని..

కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతుందా ? హవ్వ ! ట్రంప్ ఎద్దేవా

Edited By:

Updated on: Sep 09, 2020 | 11:26 AM

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీ కమలా హారిస్  ఈ దేశ తొలి మహిళా అధ్యక్షురాలైతే అంతకన్నా అవమానం మరొకటి ఉండదన్నారు అధ్యక్షుడు ట్రంప్. ఆమెను దేశంలో ఎవరూ ఇష్టపడరని, ఒకవేళ ప్రెసిడెంట్ అయితే దేశానికే ఇన్సల్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘సింపుల్ గా ఓ లెక్క చెబుతా ! ప్రెసిడెంట్ పోస్టుకు డెమొక్రాట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న జో బిడెన్ గెలిస్తే..చైనా గెలిచినట్టే ! ఒకప్పుడు చైనా ప్లేగు వ్యాధి మన దేశంలో వ్యాపించింది. దానివల్ల కోల్పోయిన ఎకానమీని మళ్ళీ అతి కష్టం మీద ఓ గాడిలో పెట్టగలిగాం..ఇది మీకూ తెలుసు అన్నారు. చైనా, నిరసనకారులు బిడెన్ గెలవాలని ఎందుకు కోరుకుంటున్నారంటే.. ఆయన పాలసీలు అమెరికా పతనానికి దారి తీస్తాయని వాళ్లకు పూర్తిగా అర్థమైంది అని ట్రంప్ పేర్కొన్నారు. నార్త్ కెరొలినా లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆయన..  అధ్యక్ష పదవికి రేసులో నిలవలేకపోయిన కమలా హారిస్ ని బిడెన్ ఎంచుకోవడం వెనుక దురుద్దేశమే ఉందన్నారు.