మోదీ నా ఫ్రెండే ! ఇండో-అమెరికన్ల ఓట్లు నావే ! డొనాల్డ్ ట్రంప్

అమెరికా ఎన్నికలకు సమయం క్రమేపీ దగ్గరపడుతుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఇండియన్ అమెరికన్లను మఛ్చిక చేసుకునే పనిలో పడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుడేనని, ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

మోదీ నా ఫ్రెండే ! ఇండో-అమెరికన్ల ఓట్లు నావే ! డొనాల్డ్ ట్రంప్

Edited By:

Updated on: Sep 05, 2020 | 12:47 PM

అమెరికా ఎన్నికలకు సమయం క్రమేపీ దగ్గరపడుతుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఇండియన్ అమెరికన్లను మఛ్చిక చేసుకునే పనిలో పడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుడేనని, ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నవంబరు 3 న జరగనున్న ఎన్నికల్లో ప్రవాస భారతీయులు కీలక పాత్ర వహిస్తారని అన్నారు.  హూస్టన్ లో ఆ తరువాత గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో తాను. మోదీ పాల్గొన్న ర్యాలీలను ట్రంప్ గుర్తు చేశారు. మోదీని ‘గ్రేట్ పర్సన్’ గా ఆయన అభివర్ణించారు. ‘ఫోర్ మోర్ ఇయర్స్’ పేరిట రూపొందించిన వీడియో రిలీజ్ అయిన సందర్భంగా ట్రంప్ ఇలా మోఢీని, ఇండియాను ఆకాశానికెత్తేశారు.

మిచిగాన్, పెన్సిల్వేనియా, ఒహియో వంటి  రాష్ట్రాల్లో ప్రవాస భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఓటరు ఓటును చేజిక్కించుకునేందుకు ఇటు ట్రంప్, అటు ఈయన ప్రత్యర్థి,డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ఎవరికీ వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us