స్నేహితులతో సరదాగా బీచ్‌కు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ 2014లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు యూఎస్‌ఏకు వెళ్లాడు. అక్కడ పీజీ చదువుతూ ఉద్యోగం చేస్తోన్న శ్రావణ్.. ఈస్టర్ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్‌ను వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా అలలు రావడంతో అతడు గల్లంతయ్యాడు. వెంటనే అతడి స్నేహితులు అక్కడున్న భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు ఎంత గాలించినా శ్రావణ్ కనిపించలేదు. ఆ తరువాత సోమవారం ఉదయం శ్రావణ్ మృతదేహం బయల్పడగా.. ఆయన మృతి విషయాన్ని కుటుంబసభ్యులకు వెల్లడించారు. దీంతో అతడి ఇంట్లో విషాదం నెలకొంది.