ఒక ఫొటో. ఒకే ఒక్క ఫొటో. రెండు కుటుంబాల్లో విషాదంలో నింపింది. చిన్నారులను అనాథలుగా మార్చింది. ఫొటో కోసం వెళ్లిన నారాయణ రావు ఫ్యామిలీకి అదే చివరి క్షణమైంది. ఉపాధి కోసం అమెరికా బాటపట్టిన నారాయణ రావు ఫ్యామిలీకి మంచు రూపంలో మృత్యువు మంచుకొచ్చింది. అసలేం జరిగింది..? అమెరికా ఆరిజోనాలో టూర్‌కు వెళ్లాయి 3 కుటుంబాలు. 11 మంది టూర్‌కు వెళ్లగా నారాయణ రావు ఫ్యామిలీ ఫొటో కోసం యత్నించింది. ఈ క్రమంలో నారాయణ రావు కింద ఉన్న మంచు కరిగి లోపలికి వెళ్లిపోయాడు. అతన్ని రక్షించేందుకు భార్య.. ఆమెను కాపాడేందుకు మరో తెలుగు వ్యక్తి గోకుల్ మేడిశెట్టి వెళ్లారు. అక్కడున్న వారు రక్షించేందుకు యత్నించినా.. ప్రయత్నం సఫలీకృతం కాలేదు. ప్రమాదంలో నారాయణ రావు, ఆయన భార్య హరిత, విశాఖ జిల్లాకు చెందిన గోకుల్ ప్రాణాలు కోల్పోయారు.
నారాయణ, హరిత దంపతులు ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆరేళ్ల పాటు న్యూజెర్సీలో ఉన్న ఫ్యామిలీ గత ఏడాది డిసెంబర్‌లో ఆరిజోనాకు షిఫ్ట్ అయ్యింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒకరు 11 ఏళ్లు, ఇంకొకరు ఏడేళ్ల కూతురు. మూడు, నాలుగు రోజుల్లో వారి మృతదేహాలను ఇండియాకు పంపేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని చెప్తున్నారు ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి.
అమెరికాలో మంచు భయపెడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 66 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గడప దాటక పోవడం మంచిదన్న సంకేతాలు మారుమోగుతున్నాయి. అయినా వీరు జాలీ ట్రిప్‌కు వెళ్లి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నారు. టూర్‌కు వెళ్లిన వారంతా టీసీఎస్ ఉద్యోగులే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం