కింద పడబోయిన చిన్నారి..తృటిలో తప్పిన ప్రమాదం

|

Dec 13, 2019 | 12:24 PM

చిన్నారులు ఉన్న చోట ఉండరు. కాళ్లొచ్చాయంటే వాళ్లను అస్సలు పట్టుకోలేం. చిచ్చర పడుగులు కదా. అనుక్షణం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏదో ఒక ఘనకార్యం చేసేస్తుంటారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇప్పుడు అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. హరికేన్‌ నగరంలో ఇద్దరు మహిళలు చిన్న బాబుతో ఓ సూపర్‌ మార్కెట్‌కు వచ్చారు. వారు తమ చిన్నారిని క్యాష్‌ కౌంటర్‌పై కూర్చొబెట్టి వస్తువులు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. వారు క్యాషియర్‌తో మాట్లాడుతుండగా […]

కింద పడబోయిన చిన్నారి..తృటిలో తప్పిన ప్రమాదం
Follow us on

చిన్నారులు ఉన్న చోట ఉండరు. కాళ్లొచ్చాయంటే వాళ్లను అస్సలు పట్టుకోలేం. చిచ్చర పడుగులు కదా. అనుక్షణం వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏదో ఒక ఘనకార్యం చేసేస్తుంటారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇప్పుడు అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఇలాంటి ఘటనే జరిగింది.

హరికేన్‌ నగరంలో ఇద్దరు మహిళలు చిన్న బాబుతో ఓ సూపర్‌ మార్కెట్‌కు వచ్చారు. వారు తమ చిన్నారిని క్యాష్‌ కౌంటర్‌పై కూర్చొబెట్టి వస్తువులు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. వారు క్యాషియర్‌తో మాట్లాడుతుండగా పిల్లాడు దొర్లుకుంటూ వచ్చి కిందబోయాడు..ఐతే అక్కడే ఉన్న స్టోర్‌ మేనేజర్‌ చూసి ఒక్క ఉదుటున బాబును పట్టుకున్నాడు. తృటిలో ప్రమాదం తప్పడంతో బాలుణ్ణి దగ్గరకు తీసుకున్న తల్లి..మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. పిల్లాణ్ణి హత్తుకొని ముద్దులు కురిపించేసింది. ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోర్ మేనేజర్‌ను హీరోగా ప్రశంసిస్తున్న నెటిజనం..మహిళలను విమర్శిస్తున్నారు. చిన్నారిని అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు.