పోర్ట్‌లాండ్‌లో జరిగిన ఉగాది సంబరాలలో తెలుగు పాట మాధుర్యం వినిపించింది. తెలుగు భాషకు పట్టం కడుతూ స్కిట్, నాటకాలు ప్రదర్శించారు. తెలుగువారంతా ఒకేచోట చేరి స్టేజ్ కార్యక్రమాలతో సందడి చేశారు. గ్రేటర్ పోర్ట్‌లాండ్ తెలుగు సంఘం నిర్వహించిన ఈవెంట్‌కి దాదాపు 2వేల మంది హాజరయ్యారు.