ఓ చిన్న విమానం అత్యవసరంగా రహదారిపై ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని వాషింగ్‌టన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పార్క్‌ల్యాండ్ నగరంలోని సౌత్ టోకోమాలో బిజీ రహదారిపై ల్యాండ్ అవుతున్న సింగిల్ ప్రొపెల్లర్ ప్లేన్ దృశ్యాలు పోలీస్ డ్యాష్‌కామ్‌లో నమోదయ్యాయి. ప్లేన్ నడుపుతున్న వ్యక్తి ఇంజిన్‌లో సమస్య కారణంగా అత్యవసరంగా దింపి రోడ్డు పక్కకు తోసుకుపోవడం అందరినీ ఆకర్శించింది.