Indian Americans: అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు భారత సంతతి పట్టు సాధిస్తోందని స్వయంగా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. తన ప్రభుత్వ యంత్రాంగంలో గణనీయ సంఖ్యలో భారత సంతతి నిపుణులకు స్థానం దక్కిందని అన్నారు. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 50 రోజులలోపే దాదాపు 57 మంది ఇండియన్ అమెరికన్లకు బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు దక్కాయి. ఈ విషయాన్ని బైడెన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘అమెరికాపై భారత సంతతి వ్యక్తుల పట్టు పెరుగుతోందని, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, నా ప్రసంగ రచయిత వినయ్‌రెడ్డి అందరూ ఇండియన్ అమెరికన్లే. మీరు అద్భుతం’ అని బైడెన్ ప్రశంసించారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకూ ఒబామా హయాంలో అత్యధిక మంది భారతీయ అమెరికన్లకు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కగా, దీనిని కొనసాగిస్తూ బైడెన్ సర్కారు తక్కువ రోజుల్లోనే అత్యధిక మందికి కీలక బాధ్యతలు అప్పగించింది. వీరిలో సగం మంది మహిళలే కావడం విశేషం.
► కమలాహ్యారిస్ – ఉపాధ్యక్షురాలు
► వివేక్‌మూర్తి – సర్జన్ జనరల్
► వనితా గుప్తా – అసోసియేట్ అటార్నీ జనరల్
► వినయ్‌రెడ్డి – బైడెన్ ప్రసంగ రచయిత
► ఉజ్రాజయ – అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సివిలియన్ సెక్యూరిటీ, డెమోక్రసీ, హ్యూమన్‌రైట్స్
► భరత్ రామమూర్తి -జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్
► గౌతమ్ రాఘవన్ – అధ్యక్ష కార్యాలయ సిబ్బంది డిప్యూటీ డైరెక్టర్
► మాలా అడిగి -బైడెన్ భార్య జిల్‌కు విధాన సలహాదారు
► తరుణ్ చాబ్రా – టెక్నాలజీ, నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్
► గరిమా వర్మ – జిల్ బైడెన్‌కు డిజిటల్ డైరెక్టర్
► సుమన గుహ -దక్షిణాసియా, జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్
► సమీరా ఫాజిల్ -జాతీయ ఆర్థికమండలి డిప్యూటీ డైరెక్టర్
► శాంతి కళాతిల్ – ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోఆర్డినేటర్
► అయేషా షా -వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ పార్ట్‌నర్‌షిప్ మేనేజర్
► సోనియా అగర్వాల్ – పర్యావరణ విధాన సలహాదారు
► సబ్రినా సింగ్ – ఉపాధ్యక్షురాలికి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ
► వేదాంత్ పటేల్ – అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ
► విదుర్ శర్మ – కొవిడ్ టెస్టింగ్ అడ్వైజర్
► నేహా గుప్తా – అసోసియేట్ కౌన్సెల్
► రీమా షా -డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్
► రోహిత్ చోప్రా – కన్జూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో డైరెక్టర్
Immigration Policy: డొనాల్డ్ ట్రంప్ సలహాలు, సూచనలు మాకు ఏ మాత్రం అవసరం లేదు: వైట్ హౌస్
హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపై చైనా పెత్తనం ! ఆగ్రహించిన అమెరికా, సహించబోమని వార్నింగ్