అమెరికా, ఇరాన్‌ల మధ్య వార్ మరింత ముదురతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జపాన్ ప్రధాని షింజో అబే ప్రయత్నం ఏ మాత్రం ఫలితాన్నివ్వలేదు. శాంతి చర్చలకు సిద్ధంగా లేమన్న దేశాధినేతల ప్రకటనలకు తోడు..ఒమన్‌లో ఆయిల్ నౌకలపై దాడులతో పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజా ఘటనలతో అమెరికా మధ్య ప్రాచ్యంలో తమ దళాలను మోహరిస్తుండటంతో టెన్షన్ వాతవరణం ఏర్పడింది.