న్యూజెర్సీలో ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఆ అమరగాయకుడి పాటలతో ఘనమైన నివాళి అర్పించారు. అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలోని మర్చి రెస్టారెంట్‌లో సంగీత ప్రియులు, సంగీత అభిమానులందరూ సమావేశమయ్యారు. వారి పాటలు, మాటలతో ఘంటసాలకు మిక్కిలి గౌరవాన్ని చేకూర్చారు. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. స్థానిక సింగర్లు ఆ పాత మధురాలను అద్భుతంగా పాడి వినిపించారు. ఈ సందర్భంగా సింగర్ శ్రీకాంత్‌ను సత్కారించారు.