ఫోర్బ్స్ జాబితాలో ఏడుగురు ఇండో అమెరికన్లు

అమెరికాలో కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ జాబితాలో ఏడుగురు ఇండో అమెరికన్లు

Edited By:

Updated on: Sep 15, 2020 | 6:58 PM

అమెరికాలో కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు. అమెరికాలో అత్యంత శ్రీమంతుడిగా ఉన్న బెజోస్‌.. వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 17వేల 9వందల కోట్ల డాలర్ల నికర ఆదాయంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా బెజోస్‌ నిలిచారు.

11వేల వంద కోట్ల డాలర్లతో సెకండ్‌ ప్లేస్‌లో బిల్‌గేట్స్‌, 8వేల 5వందల కోట్ల డాలర్లతో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మూడవ స్థానం సంపాదించారు. 7వేల 350 కోట్ల డాలర్లతో వారెన్‌ బఫెట్‌, 7వేల 2 వందల కోట్ల డాలర్లతో ఒరాకిల్‌ ఛైర్మన్‌ లారీ ఎల్లిసన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఐతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం ఈసారి కిందికి దిగజారారు. 2.5 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 339వ స్థానాన్ని దక్కించుకున్నారు.

 

ఇక ఫోర్బ్స్‌ 4వందల అమెరికన్‌ కుబేరుల జాబితాలో ఏడుగురు ఇండో అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్‌ సీఈఓ జై చౌదరీ, సింపనీ టెక్నాలజీ గ్రూపు ఛైర్మన్‌ రమేశ్‌ వాద్వాని, వేఫెయిర్‌ సీఈఓ నీరజ్‌ శా, కోశ్లా వెంచర్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ కోశ్లా, షేర్‌పాలో వెంచర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కవిటర్క్‌ రామ్‌ శ్రీరామ్‌, రాకేశ్‌ గాంగ్వాల్‌, వర్క్‌డే సీఈఓ అనిల్‌ భూశ్రీ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.