జో బిడెన్, కమలా హారిస్ లకు రోజూ కరోనా వైరస్ టెస్టులు !

| Edited By: Anil kumar poka

Aug 25, 2020 | 2:24 PM

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్  అభ్యర్థి జో బిడెన్ కి, ఉపాధ్యక్ష  పదవికి ఇదే పార్టీ నామినీ కమలా హారిస్ కి రెగ్యులర్ గా కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు వీరి సహాయకులు తెలిపారు.

జో బిడెన్, కమలా హారిస్ లకు రోజూ కరోనా వైరస్ టెస్టులు !
Follow us on

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్  అభ్యర్థి జో బిడెన్ కి, ఉపాధ్యక్ష  పదవికి ఇదే పార్టీ నామినీ కమలా హారిస్ కి రెగ్యులర్ గా కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు వీరి సహాయకులు తెలిపారు. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో తమ ప్రచారం సందర్భంగా వీరు మరిన్ని పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశాలు ఉన్న దృష్ట్యా, ముందు జాగ్రత్తగా వీటిని నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. అమెరికాలో గత మార్చి నుంచే కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో.. జో బిడెన్ చాలావరకు తమ డెలావర్ హోమ్ నుంచే ‘ప్రచార ప్రసంగాలు’ చేస్తున్నారు. గతవారం అధికారికంగా  ఆయన డెమొక్రాట్ క్యాండిడేట్ గా నామినేషన్ స్వీకరించిన అనంతరం..హెల్త్ ప్రోటోకాల్ ని ఇదివరకటికన్నా ఎక్కువగా  పాటించాల్సివస్తోంది. అలాగే ప్రజలకు ఇంకా చేరువ కావలసి ఉంది కూడా..

77 ఏళ్ళ బిడెన్, 55 ఏళ్ళ కమలా హారిస్ ఇద్దరితోనూ ఇంటరాక్ట్ అయ్యే ముఖ్య స్టాఫ్ కి రెగ్యులర్ గా కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మీరు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారా అని జర్నలిస్టులు అడిగినప్పుడల్లా బిడెన్,’లేదని’ చెబుతూ వస్తున్నారు. అయితే వివిధ పబ్లిక్ ఈవెంట్లలో ఈయన, హారిస్ ఇద్దరూ ముఖాలకు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు.