Accident : అమెరికాలో యాక్సిడెంట్.. ముగ్గురు తెలుగు వాళ్లు మృతి..

| Edited By:

Feb 26, 2020 | 3:51 AM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు తెలుగువాళ్లు మృతిచెందారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన దంపతులతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. మృతులు నగరంలోని ముషీరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన ఆవుల దివ్య, రాజా గవినిగా గుర్తించారు. ఏపీకి చెందిన వ్యక్తి ప్రేమ్‌నాథ్ రామనాథంగా గుర్తించారు. వీరంతా టెక్సాస్ రాష్ట్రం ప్రిస్కో పట్టణంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం దివ్య, రాజా గవినిల కుమార్తెను డాన్స్ క్లాస్‌ వద్ద విడిచి […]

Accident : అమెరికాలో యాక్సిడెంట్.. ముగ్గురు తెలుగు వాళ్లు మృతి..
Follow us on

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు తెలుగువాళ్లు మృతిచెందారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన దంపతులతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. మృతులు నగరంలోని ముషీరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన ఆవుల దివ్య, రాజా గవినిగా గుర్తించారు. ఏపీకి చెందిన వ్యక్తి ప్రేమ్‌నాథ్ రామనాథంగా గుర్తించారు.

వీరంతా టెక్సాస్ రాష్ట్రం ప్రిస్కో పట్టణంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం దివ్య, రాజా గవినిల కుమార్తెను డాన్స్ క్లాస్‌ వద్ద విడిచి పెట్టి.. తిరుగు ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఓ ట్రక్కు.. వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చి ఢీకొట్టంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.