ట్రంప్ జంప్..!

|

Jun 01, 2020 | 7:18 PM

అజ్ఞాతంలోకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ట్రంప్ జంప్..!
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నల్లజాతీయుల ఆగ్రహ జ్వాలలు శ్వేతసౌధాన్ని తాకాయి. నల్లజాతి యువకుడైన జార్జి ఫ్లాయిడ్ ను శ్వేతజాతి పోలీసు అధికారి అతికిరాతకంగా కాలితో తొక్కి చంపడంపై ఆగ్రహంగా ఉన్నారు. అమెరికాలో జాతి వివక్షతపై నల్లజాతీయులు గళం విప్పారు. గత వారం రోజులుగా అమెరికాలోని ప్రధాన నగరాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ‘జార్జి ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలంటూ’ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా, లూయిస్‌విల్లె, లాస్‌ ఏంజెల్స్ తదితర నగరల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్ కూడా రంగంలోకి దిగింది. అయితే వీటిని లెక్కచేయని నిరసనకారులు.. పోలీస్ వాహనాలను తగలబెట్టడంతోపాటు షాపుల్లో లూటీలకు పాల్పడుతన్నారు. ఎక్కడిక్కడా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, నిప్పురవ్వలను వెదజల్లే గ్రనేడ్‌లను నిరసనకారులపై ఉపయోగించారు. చివరికి శ్వేత సౌధం ముట్టడికి విఫలయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అతని కుటుంబ సభ్యులను బంకర్‌లోకి తరలించారు.