న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై సరికొత్త బిల్ బోర్డు..’ట్రంప్ డెత్ క్లాక్’ ! అంటే..?

| Edited By: Anil kumar poka

May 12, 2020 | 12:57 PM

అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రతను అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోలేదని పలువురు ప్రముఖులు దుమ్మెత్తిపోస్తున్నారు. సకాలంలో ఆయన చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని మరణాలు సంభవించి...

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై సరికొత్త బిల్ బోర్డు..ట్రంప్ డెత్ క్లాక్ ! అంటే..?
Follow us on

అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రతను అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోలేదని పలువురు ప్రముఖులు దుమ్మెత్తిపోస్తున్నారు. సకాలంలో ఆయన చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కావంటున్నారు. ఇలా పరోక్షంగా ఆయనను దుయ్యబడుతూ.. ‘ట్రంప్ డెత్ క్లాక్’ పేరిట న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ పై ఓ బిల్ బోర్డు వెలిసింది. ట్రంప్ మహాశయుడు సరైన సమయంలో చర్యలు తీసుకుని ఉంటే 60 శాతం కరోనా మరణాలను నివారించగలిగి ఉండేవారమంటూ ప్రముఖ సినీ నిర్మాత యూజీన్ జరెకీ ఈ బిల్ బోర్డును అక్కడ ఏర్పాటు చేశారు. సుమారు 48 వేలకు పైగా మరణాలకు అడ్డుకట్ట వేయగలిగి ఉండేవారం.. మార్చి 16 న కాకుండా మార్చి 9 నుంచే కఠిన చర్యలు తీసుకుని వుంటే ఆ మరణాలు సంభవించి ఉండేవి కావు’ అని పేర్కొన్నారు. సన్ డేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈయన రెండు సార్లు అవార్డులు గెలుచుకున్నారు.

యుధ్ధంలో మరణించిన సైనికుల పేర్లను స్మారకంపై రాసినట్టుగా ట్రంప్ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినందుకు నిదర్శనంగా మరణాల సంఖ్యను ఇప్పుడు వెల్లడించడం ఇప్పుడు అనివార్యం అని కూడా ఈ బిల్ బోర్డులో పేర్కొన్నారు.