కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. 20 మంది మృతి

| Edited By:

Aug 04, 2019 | 10:10 AM

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన వారిలో ముగ్గురు […]

కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. 20 మంది మృతి
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కాల్పులకు తెగబడిన వారిలో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయుధాలతో పెద్ద ఎత్తున కాల్పులకు దిగారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులు జరుగుతున్న సమయంలో కొందరు భయాందోళనలతో పరుగెడుతున్న వీడియోలను కొందరు ట్విట్టర్‌లో ఉంచారు.

ఎల్‌పాసో కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పుల్లో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.