ఐక్యరాజ్యసమితిలో కరోనా కలకలం.. 5 దేశాల ప్రతినిధులకు పాజిటివ్‌

న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. అందులో ఉన్న 5 దేశాల ప్రతినిధులకు కరోనా సోకింది

ఐక్యరాజ్యసమితిలో కరోనా కలకలం.. 5 దేశాల ప్రతినిధులకు పాజిటివ్‌
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2020 | 8:28 AM

UN Corona Cases: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (యునైటెడ్‌ నేషన్స్) ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. అందులో ఉన్న 5 దేశాల ప్రతినిధులకు కరోనా సోకింది. దీంతో వ్యక్తిగత సమావేశాలను రద్దు చేస్తూ యునైటెడ్ నేషన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన అధికారి ప్రతినిధి ఒకరు చెప్పారు. (Bigg Boss 4: ఆ విషయంపై రేపు మాట్లాడదామన్న అభి.. ఓకే చెప్పిన అఖిల్‌)

”యూఎన్‌లో ఐదుగురికి కరోనా సోకింది. వెంటనే అప్రమత్తమైన యూఎన్ మెడికల్ సర్వీస్‌ కాంటాక్ట్‌లను ట్రేస్ చేసే పనిలో పడింది. మంగళవారం జరగాల్సిన వ్యక్తిగత సమావేశాలను రద్దు చేశాము” అని ప్రతినిధి స్పీఫెన్‌ దుజారిక్ తెలిపారు. అయితే ఆ ఐదుగురు ఏ దేశాల ప్రతినిధులన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. (Bigg Boss 4: అఖిల్‌ ముందే అవినాష్‌కి మోనాల్‌ ముద్దు.. రచ్చ చేసిన కమెడియన్)