పవన్.. కుల సమీకరణాలొద్దు: జనసేన నేత ఆకుల

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సొంత పార్టీ నేత ఆకుల సత్యనారాయణ పరోక్షంగా విమర్శలు చేశారు. తన ఆలోచనలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో జనసేన అధినేత విఫలం అయ్యారని ఆకుల అభిప్రాయపడ్డారు. కుల సమీకరణాలతో రాజకీయాలు చేయాలనుకుంటే భంగపాటు తప్పదని.. రాబోయే ఐదేళ్లు పవన్ ప్రజల్లో ఉంటారో, లేదో కాలమే నిర్ణయిస్తుందని ఆకుల అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన […]

పవన్.. కుల సమీకరణాలొద్దు: జనసేన నేత ఆకుల
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2019 | 3:12 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సొంత పార్టీ నేత ఆకుల సత్యనారాయణ పరోక్షంగా విమర్శలు చేశారు. తన ఆలోచనలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో జనసేన అధినేత విఫలం అయ్యారని ఆకుల అభిప్రాయపడ్డారు. కుల సమీకరణాలతో రాజకీయాలు చేయాలనుకుంటే భంగపాటు తప్పదని.. రాబోయే ఐదేళ్లు పవన్ ప్రజల్లో ఉంటారో, లేదో కాలమే నిర్ణయిస్తుందని ఆకుల అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో జనసేనలో ఉన్న వారు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రావెల కిశోర్ బాబు జనసేనకు రాజీనామా చేశారు. ఇక తాజాగా ఆకుల సత్యనారాయణ కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారని.. తన సొంత పార్టీ అయిన బీజేపీలో చేరేందుకు ఆయన ఆసక్తిని కనబరుస్తున్నారని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన ఆకుల ఇప్పట్లో తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.