Breaking News
  • తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడ్డ వరదలు ఫై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన తమిళనాడు సీఎం పళనిస్వామి . హైదరాబాద్ లో భారీ , వర్షాలపై ,సహాయకచర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడిన సీఎం పళనిస్వామి . వరద ముప్పు సహాయార్థం తమిళనాడు ప్రభుత్వం తరపున 10 కోట్లు ఎక్స్గ్రేషియా ప్రకటన. ఈ విపత్కర పరిస్థితులనుండి తెలంగాణ రాష్ట్రం త్వరితగతిన బయటికిరావాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తమిళనాడు సీఎం పళనిస్వామి వెల్లడి.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్‌, సీపీ. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు సూచనలు . ఎల్లుండి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు- కలెక్టర్ ఇంతియాజ్. ఇంద్రకీలాద్రిపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం- సీపీ శ్రీనివాసులు .
  • గుంటూరు: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై వైసీపీ సంబరాలు. నగరపాలెంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రులు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడివున్నారు- మంత్రి సుచరిత. గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా చూశారు- మంత్రి సుచరిత. బీసీల సంపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మంత్రి రంగనాథ్‌రాజు . బీసీల్లో ఇన్ని కులాలు ఉన్నాయన్న సంగతీ ఎవరికీ తెలియదు-మంత్రి రంగనాథ్‌రాజు.
  • హైకోర్టులో విచారణ: ఉస్మానియా ఆసుపత్రిలో వరద చేరకుండా చర్యలు తీసుకోవాలి-హైకోర్టు . ఆసుపత్రిలో వరద, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదన్న పిల్‌పై హైకోర్టులో విచారణ. వరద బయటకు వెళ్లే సౌకర్యం లేక ఆసుపత్రిలోకి నీరు చేరుతుంది-పిటిషనర్‌. ఆసుపత్రిలోకి వస్తున్న వరద మూసీలోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు . రోగులు ఇబ్బంది పడకుండా తగిని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు . తదుపరి విచారణ నవంబర్‌12కి వాయిదా .
  • ప్రధాని మోదీ కామెంట్స్‌: ఢిల్లీ: యువ‌త‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా మార్చేందుకు.. బ‌హుళ ప‌ద్దతిలో విద్యార్థుల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఉద్యోగ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు యువ‌త‌ను తీర్చిదిద్దే ప్రయత్నం జరగాలి . ఐఐఎంల‌కు మ‌రిన్ని అధికారాలు ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటన . విద్యా వ్యవస్థలో మ‌రింత పార‌ద‌ర్శకత కోసమే నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్‌ ఏర్పాటు.
  • ఏపీ టిడిపి కమిటీలను ప్రకటించిన చంద్రబాబు. ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకం. తెలంగాణ అధ్యక్షుడు గా ఎల్ రమణ నియామకం. 25 మందితో పోలిట్ బ్యూరో . 27 మందితో కేంద్ర కమిటీ నియామకం.
  • ఓటుకు నోటు కేసు పై నేడు ఏసీబీ కోర్ట్ లో విచారణ. ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య, ఇతర నిందితులు. తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు. డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గత విచారణ లో ఏసీబీని ఆదేశించిన కోర్టు. నేడు కౌంటర్ దాఖలు చేయనున్న ఏసీబీ. ఓటుకు కోట్లు కేసులోనేడు విచారించనున్న ఏసీబీ కోర్ట్.

పెళ్లి చేసుకోవాలనుకుంటే చేతిలో చిల్లిగవ్వలేదు ః ఆదిత్య నారాయణ్‌

ఏ దుర్ముహూర్తాన పుట్టిందో కానీ కరోనావైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేసేస్తోంది.. మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం...

Aditya Narayan goes bankrupt ahead of wedding with Shweta Agarwal claims 'I've Rs 18K left in my account', పెళ్లి చేసుకోవాలనుకుంటే చేతిలో చిల్లిగవ్వలేదు ః ఆదిత్య నారాయణ్‌

ఏ దుర్ముహూర్తాన పుట్టిందో కానీ కరోనావైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేసేస్తోంది.. మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం ఓ విధంగా మేలు చేసినప్పటికీ దాని వల్ల కీడు కూడా జరిగింది.. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి.. చేద్దామంటే పనులు లేవు.. చేతిలో చిల్లిగవ్వలేదు.. సామాన్యులే కాదు.. అంతో ఇంతో పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలకు కూడా కష్టాలు తప్పడం లేదు.. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, టెలివిజన్‌ హోస్ట్‌ ఆదిత్య నారాయణ్‌ కూడా డబ్బులు లేక అవస్తలు పడుతున్నారు.. త్వరలో తన ప్రేయసి శ్వేతా అగర్వాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు కానీ పెళ్లి ఖర్చులకు అతడి దగ్గర డబ్బుల్లేవు.. నిజమే ..! లాక్‌డౌన్‌లో చేయడానికి పనుల్లేక ఖాళీగా ఉన్నాడు.. దాంతో పొదుపు చేసుకున్న సొమ్మంతా ఖర్చయ్యింది.. చివరాఖరికి సేవింగ్స్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన డబ్బును కూడా వెనక్కి తీసుకున్నాడు.. ప్రస్తుతం అతడి అకౌంట్‌లో 18 వేల రూపాయలే ఉన్నాయట! ఈ విషయాన్ని ఆదిత్య నారాయణే చెప్పుకొచ్చాడు.. ఈ నెల నుంచి పని చేయకపోతే మనుగడ కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.. బతకడానికి బైక్‌ను అమ్ముకోవాలేమోనని బాధగా చెప్పాడు.. మొత్తంగా మనం కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పిన ఆదిత్యనారాయణ్‌ త్వరలో మంచి రోజులు రావాలని కోరుకున్నాడు.

Related Tags