గ్రీన్ ఇండియా ఛాలెంజ్: తన కూతురుతో కలిసి మొక్కలు నాటిన రేణు..

ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్‌మెంట్ కల్చర్‌కి అలవాటు పడ్డామని మన చిన్నతనంలో సొంత ఇళ్లల్లో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి? పెంచాలనే విషయం...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: తన కూతురుతో కలిసి మొక్కలు నాటిన రేణు..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 1:42 PM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు తన కూతురు, కూతురి స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్‌మెంట్ కల్చర్‌కి అలవాటు పడ్డామని మన చిన్నతనంలో సొంత ఇళ్లల్లో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి? పెంచాలనే విషయం తెలియడం లేదు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య, తన స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. వారి వయసు 10 సంవత్సరాలు వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి? మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటి? అనే విషయాన్ని తెలపటం కోసం వాళ్ళిద్దరినీ తీసుకురావడం జరిగింది.

ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్నా కూడా ఓ పది, పదిహేను సంవత్సరాల తర్వాత మనం నాటిన మొక్క ఉపయోగం ఉంటుందని తెలిపారు. దాని ఫలాలు భవిష్యత్ తరాల వారు అందుకుంటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురితో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని తెలిపారు రేణు దేశాయ్.

Read More:

బ్రహ్మీ షాకింగ్ డెసిషన్.. సీరియల్స్‌లోకి ఎంట్రీ?

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో