Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

‘యాక్షన్’ మూవీ రివ్యూ : విశాల్ దుమ్మురేపాడు

Action Telugu Movie Review, ‘యాక్షన్’ మూవీ రివ్యూ : విశాల్ దుమ్మురేపాడు
బ్యాన‌ర్‌: శ‌్రీకార్తికేయ సినిమాస్‌
న‌టీన‌టులు: విశాల్, త‌మ‌న్నా, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, రామ్‌కీ, ఆకాంక్ష పూరి, క‌బీర్ దుహ‌న్ సింగ్, యోగిబాబు త‌దిత‌రులు
సంగీతం: హిప్‌హాప్ త‌మిళ‌
స్క్రీన్ ప్లే: వెంక‌ట్ రాఘ‌వ‌న్‌, సుభ, సుంద‌ర్‌.సి
నిర్మాత‌: శ్రీనివాస్ ఆడెపు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్‌.సి
ఇంట్రో:

ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి.. తమిళనాడు వెళ్లి.. హీరోగా అదరగొడుతున్నాడు విశాల్‌. మనోడు కోలీవుడ్‌లో స్టార్ హీరోగా అదరగొడుతుండగా..ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’.‌.సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంత వరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ : 
సుభాష్ (విశాల్) ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తుంటాడు.  అతని తండ్రి సీఎం. అన్నయ్య (రాంకీ) డిప్యూటి సీఎం. పెద్ద కొడుకుకి తన  ముఖ్యమంత్రి పీటం అప్పగించి ఇకపై తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని తండ్రి నిర్ణయం తీసుకుంటాడు. ఆ ప్రకటన చేయడానికి ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి అభ్యర్థి గుప్తాజీ కూడా ఈ మీటింగ్‌లో పాల్గొంటారు. శ్రవణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాసేపటికే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్‌లో ప్రధాని అభ్యర్థి గుప్తాజీ చనిపోతాడు. ప్రధాని అభ్యర్థిని.. సుభాష్ అన్ననే చంపాడని రూమర్స్ వస్తాయి. దీంతో అవమానభారంతో సుభాష్ అన్నయ్య ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సుభాష్ ఏం చేస్తాడు? అసలు ఈ బ్లాస్ట్ వెనుక ఉంది ఎవరు..? తన వాళ్ల చావుకి కారణమైన వాళ్ళను సుభాష్‌ ఎలా పట్టుకున్నాడు? వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడు? వంటి అంశాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

నటీనటులు:

విశాల్ మరోసారి తన యాక్టింగ్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌ కోసం విశాల్ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం తాలుకా విజువల్స్ తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంట‌ర్వెల్ ఫైట్ సీన్ అయితే సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక త‌మ‌న్నా తన స్క్రీన్‌ప్రెజెన్స్‌తో పాటుగా,  యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ అదరగొట్టింది. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి పాత్ర డీసెంట్‌ పంథాలో సాగిపోతుంది.  విశాల్ – ఐశ్వర్య లక్ష్మీ మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటాయి.సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన రాంకీ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మిగతా నటీనటులు తమ, తమ పాత్రల్లో పరిధిమేర నటించారు.

సాంకేతిక విభాగం :

డుడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ అదిరిపోయింది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. అలాగే సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా అందించిన సాంగ్స్ పర్వాలేదనిపించినా..నేపథ్య సంగీతంలో మాత్రం తన సత్తా చాటారు. సినిమాలోని 90 శాతం సీన్స్‌లో ప్రేక్ష‌కుల‌ు ఇన్ వాల్వ్ అయ్యేలా తెర‌కెక్కించడంతో డైరెక్ట‌ర్ పూర్తి  సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకాస్త కత్తెరకు పని చెబితే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

విశాల్ నటన
డుడ్లీ సినిమాటోగ్ర‌ఫీ
ఫస్ట్ హాఫ్
హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్
సుంద‌ర్ సి డైరెక్ష‌న్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ కొన్ని సన్నివేశాలు స్లోగా సాగటం

ఫైనల్ థాట్: ‘యాక్షన్’  పైసా వసూల్ చిత్రం