ఎన్ని శక్తులొక్కటైనా…అమ్మ ప్రేమను ఓడించలేవు..ఇదే ఉదాహరణ

తన గుడ్లను మింగేందుకు వచ్చిన ఓ పాముతో వడ్రంగి పిట్ట ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది. చెట్టు గూడులో చొరబడిన పాముతో ఫైటింగ్‌ చేసింది. దాదాపు నాలుగు సార్లు దానిని ముక్కుతో పొడుస్తూ.. తరిమి కొట్టింది. పాముతో పక్షి చేసిన పోరాటంలో అది చావు అంచులదాకా వెళ్లొంచ్చింది.

ఎన్ని శక్తులొక్కటైనా...అమ్మ ప్రేమను ఓడించలేవు..ఇదే ఉదాహరణ
Follow us

|

Updated on: Mar 03, 2020 | 11:28 AM

ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరోకటి లేదు. తల్లిప్రేమకు ఇంకేదీ సాటి రాదు. తల్లి తన బిడ్డల్ని కంటికి రెప్పల్లా కాపాడుకుంటుంది. కన్న బిడ్డల జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు. వారి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిస్తే.. ఎదురుగా ఉన్నది ఎవరైనా తీవ్రంగా ప్రతిఘటిస్తుందనటానికి ఈ వీడియో సరిగ్గా సరిపోతుంది. తన గుడ్లను మింగేందుకు వచ్చిన ఓ పాముతో వడ్రంగి పిట్ట ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది. చెట్టు గూడులో చొరబడిన పాముతో తీవ్రంగా ఫైట్ చేసింది. దాదాపు నాలుగు సార్లు దానిని ముక్కుతో పొడుస్తూ.. తరిమి కొట్టింది. పాముతో పక్షి చేసిన పోరాటంలో అది చావు అంచులదాకా వెళ్లొంచ్చింది. ఆ వడ్రంగి పిట్ట తన గుడ్లను రక్షించుకోవడానికి చేసిన పోరాటం చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.  2009లో అసఫ్పే అద్మానీ అనే ఇజ్రాయెల్ టూరిస్ట్ పేరూ దేశంలో ఈ వీడియోని షూట్ చేశాడు. తరువాత దానిని యూ ట్యూబ్ లో అప్‌లోడ్ చేయగా… అప్పట్లోనే ఆ వీడియోను 8 మిలియన్ల మంది చూశారు. తాజాగా  నందా అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఒకరు మళ్లీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ” ఈ సృష్టిలోని ఏ శక్తీ కూడా అమ్మ ప్రేమను ఓడించలేదు.” అంటూ ఆ వీడియోకు ట్యాగ్ లైన్ పెట్టారు.దీంతో మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారిన ఆ వీడియో…మీరు చూడండి…