Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

ఫస్ట్ జగన్.. లీస్ట్ మల్లాది

YS Jagan Mohan Reddy, ఫస్ట్ జగన్.. లీస్ట్ మల్లాది

గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. అందులో 151 స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతోంది. కాగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ తన ప్రత్యర్థి సతీష్ రెడ్డిపై అత్యధికంగా 90,110ఓట్లతో గెలుపొందారు. ఆ తరువాతి స్థానాల్లో అన్నా రాంబాబు(81,035), కిల్లివెటి సంజీవయ్య(61,292), సూర్య నారాయణ రెడ్డి(55,207), అంజాద్ బాషా(54,794)లు ఉన్నారు.

ఇక అత్యల్ఫ మెజారిటీ సాధించిన లిస్ట్‌లో మల్లాది విష్ణువర్ధన్ ఫస్ట్‌లో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మల్లాది విష్ణు స్వల్ప ఓట్ల మెజారిటీతో గట్టేక్కారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమపై ఆయన కేవలం 25 ఓట్లతో గెలిచారు. ఆయన తరువాత కరుణాకర్ రెడ్డి(708), వరప్రసాద రావు(814), వల్లభనేని వంశీ(838), వీరంజనేయ స్వామి(1,024)లు ఉన్నారు. కాగా మరోవైపు ఎంపీల్లో వైఎస్ అవినాశ్ రెడ్డి 3,80,976ఓట్ల మెజారిటీ సాధించి టాప్‌లో ఉండగా.. గల్లా జయదేవ్ 4,205 మెజారిటీతో లీస్ట్‌లో ఉన్నారు.

Related Tags