Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

సోఫిటెల్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా

Karnataka crisis live updates, సోఫిటెల్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా

ముంబైలో కర్నాటక కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోఫిటెల్ హోటల్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. గోవా లాగే కర్నాటకలో కూడా బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిందని ఆరోపించారు.

కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. సోఫిటెల్ హోటల్‌ దగ్గరకు అదనపు బలగాలను తరలించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీ కుట్రలను అడ్డకుంటామని స్పష్టం చేశారు.

Related Tags