ఉక్రెయిన్‌పై యుద్దం చేయడం వల్ల రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ దెబ్బతిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్‌ను ప్రపంచం చంపాలని అనుకుంటోందని వ్యాఖ్యానించారు. తమ దళాలు తూర్పు ఉక్రెయిన్‌లో దాదాపు 21 వేలమంది వాగ్నర్ సైనికులను మట్టుబెట్టాయని పేర్కొన్నారు. అలాగే మరో 80 వేల మంది ఆ గ్రూప్‌కు చెందిన వారు గాయపడ్డారని తెలిపారు. ఈ గ్రూపును తాము రష్యా సైన్యం ప్రేరేపిత ముకగా చూస్తామన్నారు. అయితే పుతిన్‌పై వాగ్నర్ లీడర్ ప్రిగోజిన్ తిరుగాటు చేసిన వారం రోజుల తర్వాత జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా దాదాపు 12 రోజుల తర్వాత రష్యా మళ్లీ ఉక్రెయిన్‌పై డ్రోన్లతో దాడులకు పాల్పడింది. కీవ్‌పై డ్రోన్ల దాడి జరిగినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని కూల్చివేసిందని తెలిపాయి. శత్రువులు మళ్లీ ఈసారి దాడులు చేసినప్పటికీ ఈసారి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని కర్నర్ జనరల్ సెర్హీ పాప్కోవ్ అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.