మార్స్ పైకి నాసా ప్రయోగించిన పర్సేవేరెన్స్ అనే రోవర్ ఈ గ్రహంపై విజయవంతంగా దిగింది. టేకాఫ్ అయిన దాదాపు 7 నెలల తరువాత ఇది ఫిబ్రవరి 19 న అరుణ గ్రహంపై గల జెజీరో క్రేటర్ ని తాకింది. కాగా 300 బిలియన్ డాలర్ల ఈ భారీ మిషన్ ని కంట్రోల్ చేస్తున్నదెవరంటే ఆశ్చర్యం కలగక మానదు. భారత దేశంలో పుట్టి అమెరికాలో స్థిర పడిన ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా తన వన్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లో కూర్చుని దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన లండన్ లో ఉన్నారు. నిజానికి కాలిఫోర్నియాలోని తన కంట్రోల్ మిషన్ రూమ్ లో కూర్చుని ఈయన రోవర్ ని కంట్రోల్ చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ప్రొఫెసర్ గుప్తా అక్కడికి వెళ్లలేకపోయారు. అద్దెకు తీసుకున్న తన అపార్ట్ మెంట్ లోనే ఆయన ఈ కార్యక్రమం చేబట్టారు. కాలిఫోర్నియాలో తాను జెట్ ప్రోపేల్షన్ ల్యాబ్ లో ఉండాల్సిందని, ఈ అపార్ట్ మెంట్ కన్నా అది చాలా పెద్దదని ఆయన చెప్పారు. అతి పెద్ద స్క్రీన్లు ఉండగా వందలాది శాస్త్రజ్ఞులు, ఇంజనీర్ల మధ్య తాను ఈ బాధ్యత చేపట్టాల్సి ఉందన్నారు. తన భార్య, పిల్లల నిద్రను భంగపరచే ఇష్టం లేక ఈ అపార్ట్ మెంటును మినీ కంట్రోల్ రూమ్ గా మార్చుకున్నానన్నారు.
5 కంప్యూటర్లు, రెండు స్క్రీన్లు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో ఉంది ఈయన గది. లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఈయన జియాలజీ నిపుణుడు కూడా.. సుమారు 400 మంది రీసెర్చర్లతో గుప్తా రోవర్ ని డైరెక్ట్ చేస్తున్నారు. రోవర్ పంపే శాంపిల్స్ 2027 కల్లా భూమిని చేరుతాయని భావిస్తున్నారు. ఒక ప్రవాస భారతీయుడు ఇంత పెద్ద బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమని నిపుణులు అంటున్నారు. నాసా తన రోవర్ కదలికల నియంత్రణకు ఓ ప్రవాస భారతీయుని సేవలను వినియోగించుకోవడం గమనార్హమని అంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :