Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌లో కమ్ముకొస్తోన్న యుద్ధమేఘాలు.. రణ రంగంలో యుద్ధభేరి మోగిస్తోన్న రష్యా..

|

Feb 21, 2022 | 8:45 PM

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా యుద్ధఘంటికలు మోగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలు, మరో వైపు లక్షల సంఖ్యలో సైనిక బలగాల మోహరింపుతో రష్యా వైఖరి ఇప్పుడు అమెరికాకి సవాల్‌గా మారింది. ఇటు ఉక్రెయిన్‌, అటు మాస్కో దళాల..

Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌లో కమ్ముకొస్తోన్న యుద్ధమేఘాలు.. రణ రంగంలో యుద్ధభేరి మోగిస్తోన్న రష్యా..
Russia Ukraine
Follow us on

ఉక్రెయిన్‌ (Ukraine)సరిహద్దుల్లో రష్యా (Russia)యుద్ధఘంటికలు మోగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలు, మరో వైపు లక్షల సంఖ్యలో సైనిక బలగాల మోహరింపుతో రష్యా వైఖరి ఇప్పుడు అమెరికాకి సవాల్‌గా మారింది. ఇటు ఉక్రెయిన్‌, అటు మాస్కో దళాల సైనిక విన్యాసాలు ఏ క్షణమైనా యుద్ధాన్ని మోసుకొచ్చేలా ఉన్నాయి. ఎటువైపు నుంచి యుద్ధం ముంచుకొస్తుందో తెలియని యుద్ధవాతావరణం నెలకొంది. ఇటు రష్యా, అటు ఉక్రెయిన్‌ సైనిక విన్యాసాలు ఇరుదేశాల సరిహద్దుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరో వైపు ఉక్రెయిన్‌లో కమ్ముకొస్తోన్న యుద్ధమేఘాలు ఓ వైపు అగ్రరాజ్యం అమెరికానీ మరో వైపు నాటో సభ్య దేశాలనూ హడలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్‌కి అనుకూల, వ్యతిరేక స్టాండ్‌తో ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోన్న ఉక్రెయిన్‌ వార్‌ జోన్‌లో అసలేం జరుగుతోంది? ఉక్రెయిన్‌లో యుద్ధఘంటికలు ముంచుకొస్తున్నాయి. గత కొంత కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సర్వసన్నాహాలు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో లక్షల సంఖ్యలో రష్యా బలగాల మోహరింపు, అందుకు ప్రతిగా ఉక్రెయిన్‌ సేనలు రణక్షేత్రంలోకి దూకేందుకు సర్వసన్నద్ధం అవుతున్నాయి. 24 గంటల్లో 1,5000ల పేలుళ్ళు ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాన్ని రణరంగంగా మార్చాయి.

ఓ వైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చర్చలకు సిద్ధమంటున్నారు. మరో వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధానికి సంసిద్ధం అవుతున్నారు. రష్యాతో చర్చలకు అమెరికా ఏకైక షరతు విధించింది. యుద్ధ నివారణలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లు బేటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అమెరికా ఈ సమావేశం జరగాలంటే రష్యా ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడకూడదంటూ శ్వేత సౌధం అల్టిమేటం విధించింది.

రష్యా అణుసాంప్రదాయక సైనిక విన్యాసాల్లో భాగంగా ఉక్రెయిన్‌కి, ఉక్రెయిన్‌ అనుకూల దేశాలకు రష్యా డేంజర్‌ సిగ్నల్స్‌ ఇచ్చింది. బెలారస్‌తో ఆదివారం ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాల పొడిగింపు రష్యా యుద్ధ సంసిద్ధతను చెప్పకనే చెపుతోంది. నల్లసముద్రతీరం మాస్కో సేనల నావికా విన్యాసాలతో దద్దరిల్లిపోతోంది. ఓ వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కాల్పుల విరమణకు ఓకే చెపుతూనే మరో వైపు ఉక్రెయిన్‌ వ్యతిరేక, తన అనుకూల ప్రాంతాలతో యుద్ధసన్నద్ధతను ప్రకంటించేలా చేయడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ఉక్రెయిన్‌ నుంచి విడిపోయి, రష్యా అనుకూల వేర్పాటువాద రెండు ప్రాంతాలు యుద్ధానికి సిద్ధమని ప్రకటించేలా రష్యా కుయుక్తులు కలకలం రేపుతున్నాయి. దీంతో క్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్‌ దళాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో రెండు లక్షల సైన్యాన్ని మోహరించడం ఉద్రిక్తతలను తిరిగి రాజేస్తోంది.

ఇవి కూడా చదవండి: Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు