Tsunami Effect Video: పసిపిక్‌ తీరంలో విరుచుకుపడ్డ సునామీ… ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగళాలు.. వీడియోలు వైరల్‌

సునామీ దెబ్బకు రష్యా, జపాన్‌ సహా పలు పసిపిక్‌ తీర దేశాలు వణికిపోతున్నాయి. రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం కారణంగా తీర ప్రాంత దేశాలపై సునామీ విరుచుకుపడింది. సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. పసిఫిక్‌ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్‌పై...

Tsunami Effect Video: పసిపిక్‌ తీరంలో విరుచుకుపడ్డ సునామీ... ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగళాలు.. వీడియోలు వైరల్‌
Tsunami Effect Whales

Updated on: Jul 30, 2025 | 1:18 PM

సునామీ దెబ్బకు రష్యా, జపాన్‌ సహా పలు పసిపిక్‌ తీర దేశాలు వణికిపోతున్నాయి. రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం కారణంగా తీర ప్రాంత దేశాలపై సునామీ విరుచుకుపడింది. సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. పసిఫిక్‌ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్‌పై విరుచుకుపడింది. 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. నడి సముద్రంలో ఉండాల్సిన భారీ తిమింగలాలు ఎవరో విసిరేసినట్లు తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి:

 

మరోవైపు ఇప్పటికే రేడియేషన్‌ లీకేజీతో సమస్యాత్మకంగా మారిన ఫుకుషిమా డయీచీ అణుకేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు. జపాన్‌లోని పసిఫిక్‌ తీరంలో ఉన్న కొన్ని దీవులపై సునామీ అలలు ఎగసిపడ్డాయి., టొకచాయ్‌ పోర్టులో 40 సెంటీమీటర్ల అలలు రాగా.. ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. థోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు తాకాయి. హన్సంకిలో 30 సెంటీమీటర్ల ఎత్తున అలలు వచ్చినట్లు ఎన్‌హెచ్‌కే పేర్కొంది. ఇషినోమొకి పోర్టులో 50 సెంటీమీటర్ల అలలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్‌ ఎయిర్‌ పోర్టులు కూడా సునామీ హెచ్చరికలతో అలర్ట్‌ అయ్యాయి. ఈశాన్య జపాన్‌లోని సెండాయ్‌ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ ప్రాంతానికి వచ్చే విమానాలను దారి మళ్లిచారు.