Deepfake: డీప్‌ ఫేక్‌పై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం..

అయితే ఇప్పుడు ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలు అగ్ర రాజ్యం అమెరికాను సైతం భయపెడుతోంది. ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలో డీప్‌ఫేక్‌ కలకలం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్‌ వాయిస్‌ను అనుకరించేలా కొందరు మోసగాళ్లు ఏఐ-ఆధారిత ఫోన్‌కాల్స్‌ను సృష్టించారు...

Deepfake: డీప్‌ ఫేక్‌పై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం..
USA
Follow us

|

Updated on: Feb 12, 2024 | 5:52 PM

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా యావత్ ప్రపంచాన్ని వణికించిన ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీలో విప్లవాన్ని తీసుకొస్తుందని అనుకుంటున్న సమయంలో వచ్చిన డీప్‌ ఫేక్‌ వీడియోలతో అంతా షాక్‌ అయ్యారు.

అయితే ఇప్పుడు ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలు అగ్ర రాజ్యం అమెరికాను సైతం భయపెడుతోంది. ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలో డీప్‌ఫేక్‌ కలకలం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్‌ వాయిస్‌ను అనుకరించేలా కొందరు మోసగాళ్లు ఏఐ-ఆధారిత ఫోన్‌కాల్స్‌ను సృష్టించారు. దీంతో తప్పుడు ప్రచారం సృష్టించి, వీడియోలను వైరల్‌ చేశారు. ఈ చర్యతో అప్రమత్తమైన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో ‘ఏఐ- ఆధారిత వాయిస్‌ రోబోకాల్స్‌’పై నిషేధం విధించింది. ఈమేరకు ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘కొంతమంది నేరగాళ్లు కృత్రిమమేధ సాంకేతికతను ఉపయోగించి నకిలీ వాయిస్‌ రోబోకాల్స్‌ను సృష్టిస్తున్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, సెలబ్రిటీలను ఇమిటేట్‌ చేసి తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఆడియో, వీడియో కాల్స్‌ను సృష్టించినా.. ఇప్పుడు ఉన్న అధునాతన సాంకేతికతతో ఈ నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ఇలాంటి ఫేక్‌ రోబోకాల్స్‌ కొత్త ముప్పును తెచ్చిపెడుతున్నాయి’’ అని ఎఫ్‌సీసీ కమిషనర్‌ జియోఫ్రే స్టార్క్స్‌ తెలిపారు.

ఇందులో భాగంగానే ఏఐ ఆధారిత రోబో కాల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నిషేధం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఏ కంపెనీ అయినా ఇలాంటి వీడియోలను సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమానా విధిస్తామని అగ్రరాజ్యం హెచ్చరించింది. ఇదిలా ఉంటే భారత్‌లో కూడా సినీతారల విషయంలో వైరల్‌ అయిన డీప్‌ ఫేక్‌ వీడియోల గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. డీప్‌ఫేక్‌ వీడియోలపై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్