అయ్యో ఏంటీ ఈ దారుణం.. కుక్కలకు అన్నం పెట్టినందుకు ఆమెపై దాడి చేసి చంపుతాయా

|

Mar 20, 2023 | 11:51 AM

సాధారణంగా శునకాలను కొంతమంది పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరు వద్దనుకుంటారు. అయితే మరికొంతమంది జంతు ప్రేమికులు శునకాలకు ఏదైనా ఆహారం పెట్టేందుకు ఇష్టపడతారు.

అయ్యో ఏంటీ ఈ దారుణం.. కుక్కలకు అన్నం పెట్టినందుకు ఆమెపై దాడి చేసి చంపుతాయా
Dogs
Follow us on

సాధారణంగా శునకాలను కొంతమంది పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరు వద్దనుకుంటారు. అయితే మరికొంతమంది జంతు ప్రేమికులు శునకాలకు ఏదైనా ఆహారం పెట్టేందుకు ఇష్టపడతారు. కానీ అమెరికాలోనిపెన్సిల్వేనియాలో ఓ మహిళ ఇలా తన ఇంటి పక్కన ఉన్న పెంపుడు కుక్కలపై సానుభూతి చూపింది. ఆ ఇంటి యజమాని అక్కడి నుంచి పనిమీద బయటికి వెళ్లాడు. దీంతో ఆయన ఇంటికి క్రిస్టీన్ పాట్టర్ (38) అనే మహిళ తన చిన్న కొడుకుతో కలిసి అక్కడ ఉన్న కుక్కలకి ఆహారం పెట్టేందుకు వెళ్లింది. అయితే అవి ఆహారాన్ని తింటుండగా రెండు గ్రేట్ డేన్స్ కుక్కలు ఒక్కసారిగా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాయి. ఇది గమనించిన ఆమె కొడుకు తన రోడ్డు పైకి పరిగెత్తి తన సోదరుడ్ని పోలీసులకు కాల్ చేయమంటూ అరిచాడు.

అయితే కుక్కలు క్రిస్టీన్ పాట్టర్ ను క్రూరంగా దాడి చేయడంతో అప్పటికే ఆమె మరణించింది. ఆ ఇంటివద్ద మరో గ్రేట్ డీన్స్, ఫ్రెంచ్ బుల్ డాగ్ అనే కుక్కలు కూడా ఉన్నాయని కానీ అవి ఆమెపై దాడి చేయలేవని పోలీసులు తెలిపారు. ఆమె ఆ కుక్కలకు ఆహారం పెడుతుండగా ఆ రెండు గ్రేట్ డేన్ కుక్కులు ఒకదానికికొకటి పోట్లాడుకున్నాయని దీంతో క్రిస్టీన్ పాట్టర్ వాటి మధ్యలో జోక్యం చేసుకోవడంతో ఆమెపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. మరో విషాధకరమైన విషయం ఏంటంటే క్రిస్టోఫర్ పాట్టర్ భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోగా తన కుమారుడు కూడా 11 ఏళ్ల వయసున్నప్పుడు చనిపోయాడని ఆమె బంధువులు తెలిపారు. ఆమెకు ఇటీవల ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా అయ్యిందని.. తనకు కాబోయే భర్తతో ఫ్లోరిడాకు వెళ్లిపోవాలని అనుకుందని పేర్కొన్నారు. కుక్కలకు సానుభూతితో ఆహారం పెడితే అవే ఆమెను దాడి చేసి చంపేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.