US President: డోనాల్డ్ ట్రంప్ న్యూ హెయర్ స్టైల్ చూశారా.. పిచ్చెక్కిపోతుంది అంతే..!

|

Dec 18, 2024 | 7:44 PM

అగ్రరాజ్యం అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా త్వరలో పదవిని చేపట్టనున్నాడు డోనాల్డ్ ట్రంప్. ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై విజయ బావుటా ఎగురవేశారు. కొత్త ఏడాది 2025 జనవరి 20 వ తేదీన రెండో సారి అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేయనున్నారు. యితే తాజాగా ట్రంప్ కి సంబందించిన ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

US President: డోనాల్డ్ ట్రంప్ న్యూ హెయర్ స్టైల్ చూశారా.. పిచ్చెక్కిపోతుంది అంతే..!
Donald Trump New Hair Style
Follow us on

ఇటీవలే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా పదవిని చేపట్టనున్నారు. 2025 జనవరి నెలలో అమెరికా అధ్యక్ష పదవిలోని చేపట్టి దేశాన్ని ఏలనున్నారు. కమలా హారీస్ పై విజయం సాధించిన ట్రంప్  78 ఏళ్ల వయసులో దేశాధ్యక్ష పదివికి ఎన్నికై వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అతను ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో కనిపించాడు.

డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన హెయిర్ స్టైల్‌లో వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంటు ధరించి న్యూ లుక్ లో కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరికొత్త గెటప్ లో ట్రంప్ చాలా అందంగా కనిపిస్తున్నారు. మేక్ఓవర్‌ తర్వాత లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. జనవరి 20, 2025న జరిగే అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంలో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో ట్రంప్ లుక్ ఎలా ఉన్నదంటే

 

ట్రంప్ హెయిర్ స్టైల్ .. న్యూ లుక్ అంటూ వైరల్ అవుతున్న వీడియోలో బ్లాక్ ప్యాంట్ , వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్ షూస్ ధరించి చాలా హ్యండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ గోల్డ్ క్లబ్‌లో తన ప్రైవేటు ప్రాపర్టీ వద్దకు వచ్చిన సందర్భంలో ట్రంప్ ఇలా దర్శనం ఇచ్చారు. అయితే ఈ కొత్త స్టైల్ మేకోవార్ కాదని.. ట్రంప్ జుట్టుకు టోపీ ధరించడం వలన వచ్చిన కొత్త హెయిర్ స్టైల్ అని తెలుస్తోంది. టోపీ తీసిన తర్వాత ట్రంప్ కొత్త లుక్ లో కనిపించారు. అయితే కొత్త లుక్‌లో ట్రంప్ చాలా అందంగా ఉన్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. హీరోలా ఉన్నారు.. కొత్త హెయిర్ స్టైల్ అదుర్స్ అంటూ రకరకాల కామెంట్స్ ను చేస్తూ సందడి చేస్తున్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..