
ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తనదైన శైలిలో చమత్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రన్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ నుండి నిరంతరం భద్రతాపరమైన ముప్పులు, హెచ్చరికలు వస్తున్నాయి. ఇటువంటి అత్యంత కీలకమైన, సున్నితమైన సమయంలో ఒక దేశ అధ్యక్షుడిగా ట్రంప్ వైట్ హౌస్‌లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన ఆ బాధ్యతలను పక్కనబెట్టి, తన కుమారుడి పెళ్లికి హాజరైతే.. “దేశం ఇంత సంక్షోభంలో ఉంటే, అధ్యక్షుడు బాధ్యతారాహిత్యంగా వేడుకల్లో పాల్గొంటున్నాడు” అని మీడియా, విపక్షాలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తాయని ట్రంప్ అన్నారు.
అదే సమయంలో, విమర్శలకు భయపడి ఆయన పెళ్లికి వెళ్లకుండా వైట్ హౌస్‌లోనే ఉండిపోతే.. “సొంత కొడుకు పెళ్లికి కూడా వెళ్లలేని కఠిన హృదయుడు” అని కుటుంబ సభ్యులు లేదా ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. అందుకే నేను పెళ్లికి వెళ్తే.. మీడియా నన్ను విమర్శలతో చంపేస్తుంది, వెళ్లకపోతే ఇంట్లో వాళ్లు చంపేస్తారు” అంటూ తనదైన శైలిలో చమత్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రన్తుతం ట్రంప్ వ్యాఖ్యానించడం వెనుక ఉన్న అసలు అర్థం ఇదే. రాజకీయ రచ్చకు, కుటుంబ బాధ్యతలకు మధ్య నలిగిపోతున్న ఒక తండ్రి, దేశాధ్యక్షుడి స్థితిని ఆయన తనదైన హాస్య చతురతతో వ్యంగ్యంగా వ్యక్తపరిచారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ ఉద్రిక్తతల తీవ్రతను, అమెరికా అధ్యక్షుడిపై ఉండే ఒత్తిడిని స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..