
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ స్వయంగా స్వాగతం పలికారు. సాధారణంగా విదేశీ నేతలకు వైట్‌హౌస్‌లో స్వాగతం పలికే అమెరికా అధ్యక్షుడు.. ఈసారి విమానాశ్రయానికే వెళ్లి జిన్‌పింగ్‌ను ఆహ్వానించడం అరుదైన ప్రోటోకాల్‌గా నిలిచింది.
11 ఏళ్లకు పైగా విరామం తర్వాత షీ జిన్‌పింగ్ అమెరికాలో అధికారిక పర్యటనకు వచ్చారు. అమెరికా-చైనా సంబంధాల్లో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, భద్రత, ఇరాన్ తదితర అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పర్యటన జరుగుతోంది. జిన్‌పింగ్‌తో పాటు ఆయన భార్య పెంగ్ లియువాన్ కూడా అమెరికాకు వచ్చారు. రన్‌వేపై రెడ్ కార్పెట్, సైనిక గౌరవ వందనం, మిలిటరీ బ్యాండ్‌తో ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం, రోజ్ గార్డెన్‌లో సైనిక గౌరవ కార్యక్రమం, సాయంత్రం స్టేట్ డిన్నర్ జరగనుంది.
ఈ పర్యటనలో మెలానియా ట్రంప్ పాత్ర కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. వైట్‌హౌస్ విడుదల చేసిన వివరాల ప్రకారం, జిన్‌పింగ్–పెంగ్ దంపతుల పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల్లో మెలానియా నేరుగా భాగస్వామ్యం అయ్యారు. ఆమెతో పాటు పెంగ్ లియువాన్‌కు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాగా, గురువారం (సెప్టెంబర్ 24) జరిగే విందుకు టెక్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మన్, జెన్సన్ హువాంగ్, మైఖేల్ డెల్ తదితరుల పేర్లు అతిథుల జాబితాలో ఉన్నాయి. అమెరికా-చైనా మధ్య కీలక అంశాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో షీ పర్యటనకు ఈ స్థాయిలో స్వాగతం, అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
#WATCH | Chinese President Xi Jinping and First lady Peng Liyuan arrive in the United States; US President Donald Trump and First Lady Melania Trump receive them at Joint Base Andrews https://t.co/ttOtyjlEnX
— ANI (@ANI) September 23, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక చేయండి..