నెలలు గడుస్తున్నా ఉక్రెయిన్(Ukraine) పై రష్యా చేస్తున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. బాంబులు, క్షిపణుల వర్షం కురుస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ లోని మేరియుపొల్, బుచా వంటి నగరాలు ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల సైనికులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల సంఖ్యను వెల్లడించేందుకు రష్యా(Russia) ఇష్టం చూపకపోయినప్పటికీ.. మృతి చెందిన రష్యా సైనికుల సంఖ్యను మాత్రం ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 21,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ట్విటర్(Twitter) లో వెల్లడించింది. శత్రు దేశానికి చెందిన 176 యుద్ధ విమానాలు, 153 హెలికాప్టర్లు, 838 యుద్ధ ట్యాంకులు, 2,162 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌కు విదేశాల నుంచి ఆయుధ సహాయం అందుతుండటంతో రష్యాపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే స్విచ్ బ్లేడ్ డ్రోన్ల వంటి అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేసిన అమెరికా.. తాజాగా మరో రహస్య ఆయుధాన్ని సరఫరా చేయనున్నట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కెర్బీ వెల్లడించారు.
మరియాపోల్‌ను స్వాధీనం చేసుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తే.. అందులో నిజం లేదని ఉక్రెయిన్ అంటోంది. అజోవ్‌స్తల్ స్టీల్‌ప్లాంట్ తమ బలగాలు రష్యా దురాక్రమణను అడ్డుకుంటున్నాయని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని పోర్ట్‌సిటీ మరియుపోల్‌ని పూర్తిగా స్వాధీనం చేసుకునట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు. మేరియుపోల్‌ను విముక్తం చేశామని రష్యా అధ్యక్షుడే చెప్పుకుంటుంటే, అంత సీన్ లేదని ఉక్రెయిన్ ఖండించింది. మేరియుపోల్‌లోని అజోవ్‌స్థల్ స్టీల్‌ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా వాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. స్టీల్‌ప్లాంట్‌లో ఇంకా సాయుధులు ఉన్నారనీ, రష్యా దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయిందని ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.
Information on Russian invasion
Losses of the Russian armed forces in Ukraine, April 22 pic.twitter.com/E8wwtjoD9S
— MFA of Ukraine ?? (@MFA_Ukraine) April 22, 2022
also read