UK Strike: బ్రిటన్‌లో అతిపెద్ద రవాణా సమ్మె.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రజారవాణా.. ఇంతకీ స్ట్రైక్ ఎందుకంటే..

|

Aug 22, 2022 | 10:30 AM

UK Strike: బ్రిటన్‌లో అతిపెద్ద రవాణా సమ్మె ప్రారంభమైంది. రైలు, బస్సుల సర్వీసుల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడంతో ప్రజారవాణా నిలిపోయింది.

UK Strike: బ్రిటన్‌లో అతిపెద్ద రవాణా సమ్మె.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రజారవాణా.. ఇంతకీ స్ట్రైక్ ఎందుకంటే..
Strike
Follow us on

UK Strike: బ్రిటన్‌లో అతిపెద్ద రవాణా సమ్మె ప్రారంభమైంది. రైలు, బస్సుల సర్వీసుల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడంతో ప్రజారవాణా నిలిపోయింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం బ్రిటన్‌లో రవాణా కార్మికులు సమ్మె ప్రారంభించారు. వేలాది మంది సమ్మెలో పాల్గొనడంతో రైలు, బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. వేతనాలను పెంచడంతో పాటు తమ ఉద్యోగాలకు సంబంధించిన అగ్రిమెంట్ల విషయంలో కార్మికులు ప్రభుత్వంతో నేరుగా పోరాటం ప్రారంభించారు. తమ సమస్యలను పరిష్కరించాలని రవాణా కార్మికులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలితాలను ఇవ్వకపోవడంతో కార్మిక సంఘాలు ముందుగా నోటీసు ఇచ్చి సమ్మెను ప్రారంభించాయి.

ప్రజలకు వెంటనే ఇబ్బంది ఏర్పడకుండా రవాణా సమ్మెను దశలవారీగా ప్రారంభించారు. రైలు, బస్సుల డ్రైవర్లు తమ విధులను బహిష్కరించడంతో లండన్‌తో పాటు పలు నగరాల్లో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లండన్‌లో ట్యూబ్‌ సర్వీసులు చాలా వరకూ నిలచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ అసౌర్యానికి ప్రజలు తమను క్షమించాలని కోరాయి కార్మిక సంఘాలు. తమ సమస్యలపై వారు సానుభూతి చూపించాలని కోరారు. తాము మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు, ఉద్యోగ భద్రత కోసం ఈ సమ్మె అవసరం అని వారు చెబుతున్నారు.

కాగా కార్మిక సంఘాల తీరును ప్రయాణీకులు తప్పు పడుతున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం ద్వారా డిమాండ్లను సాధించుకోవాలనుకోవడం మూర్ఖత్వం అంటున్నారు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగుతున్న ఆధునిక కాలంలో ఇలాంటి సమ్మెలతో పెద్దగా ఫలితం ఉండదని, ప్రభుత్వంతో సామరస్యంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..