బరువో బరువు ! భారీ కాయం ! ట్రక్కులోకెక్కిన ఐసిస్ ‘గురువు’

| Edited By: Anil kumar poka

Jan 19, 2020 | 12:33 PM

సిరియా, ఇరాక్ వంటిచోట్ల ఐసిస్ గ్యాంగులకు గురువులాంటోడైన అబూ అబ్దుల్ బారి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే 250 కెజీల ఇతని భారీకాయం వారి కారులో పట్టకపోవడంతో.. ప్రత్యేకంగా ఓ ట్రక్కునే తెప్పించాల్సివచ్చింది. ఇరాకీ దళాలకు చెందిన ‘స్వాత్ ‘ టీమ్‌కి ఈ శ్రమ తప్పలేదు. ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఈ మహాకాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇతడ్ని ‘ జబ్బా ది జిహాదీ ‘ అని వ్యవహరిస్తారట. భద్రతా దళాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు […]

బరువో బరువు ! భారీ కాయం ! ట్రక్కులోకెక్కిన ఐసిస్ గురువు
Follow us on

సిరియా, ఇరాక్ వంటిచోట్ల ఐసిస్ గ్యాంగులకు గురువులాంటోడైన అబూ అబ్దుల్ బారి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే 250 కెజీల ఇతని భారీకాయం వారి కారులో పట్టకపోవడంతో.. ప్రత్యేకంగా ఓ ట్రక్కునే తెప్పించాల్సివచ్చింది. ఇరాకీ దళాలకు చెందిన ‘స్వాత్ ‘ టీమ్‌కి ఈ శ్రమ తప్పలేదు. ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఈ మహాకాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇతడ్ని ‘ జబ్బా ది జిహాదీ ‘ అని వ్యవహరిస్తారట. భద్రతా దళాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడన్న ఆరోపణలు బారిపై ఉన్నాయి. ఐసిస్ ముఠాలకు ఇతగాడు నాయకుడు కూడానని తెలిసింది. ఈ ఉగ్రవాద సంస్థకు విధేయులుగా ఉండేందుకు నిరాకరించిన ఇస్లామిక్ గురువులను హతమార్చవలసిందిగా బారి ‘ఫత్వా’లు కూడా జారీ చేస్తాడని అంటున్నారు. బారిని, ఇతని ఒబెసిటీని అపహాస్యం చేస్తూ.. అతని ఫొటోతో.. లండన్‌లోని ఇస్లాం తీవ్రవాద వ్యతిరేక యాక్టివిస్టు మాజిద్ నవాజ్ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్టులు పెట్టాడు. అయితే ఊబకాయాన్ని తాను తప్పు పట్టడంలేదని,  ఇస్లామిక్ తీవ్రవాదుల హిపోక్రసీని మాత్రమే తను బయటపెడుతున్నానని ఆయన అంటున్నాడు.