
ఇండియా లాంటి ట్రేడ్ఫ్రెండ్లీ పాలసీల్ని చూసి, పరిశ్రమలకు మనం ఇస్తున్న సబ్సిడీల్ని చూసి, వరల్డ్స్ ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్నాం అని మన ప్రధాని పదేపదే ఇస్తున్న స్టేట్మెంట్స్ని వినీవినీ బాగా కాలినట్టుంది అమెరికాకు. నాటోన్లీ ఇండియా, చైనా, ఈయూ దేశాల ప్రొడక్టివిటీ స్పీడును చూసి జడుసుకున్నట్టుంది సోకాల్డ్ అగ్రరాజ్యం. తమ తయారీదారులను దెబ్బతీస్తోందని, తమ జీడీపీని నేలకరిపిస్తుందని బెంబేలెత్తిపోయింది. అల్సర్ ఫీలింగ్‌ను మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపిస్తారని, ఈ వారంలోనే సుంకాల మోత ఉండొచ్చని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ స్టోరీ కూడా రాసింది. భయపడినట్టే జరిగింది. అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని మళ్లీ కెలికేశాడు డొనాల్డ్ ట్రంప్. అవును.. టారిఫ్‌ల మందుపాతర మీద మళ్లీ కాలేశాడు ట్రంపాసురుడు. మొత్తం 14 దేశాలపై కొత్తగా సుంకాలు వేసి తనలో ఆ సుంకాల పిచ్చోడు ఇంకా బతికే ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. ఇండియా మీదైతే ఏకంగా 25 శాతం సుంకాన్ని బాది, మేం చెప్పినట్టు వ్యాపారం చేస్తే, 17శాతానికి తగ్గిస్తామని బంపరాఫర్ కూడా ఇచ్చాడు. మన దేశంతో పాటు, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఈయూ, బంగ్లాదేశ్ లాంటి 14 ఆర్థిక వ్యవస్థల్ని డిస్టర్బ్ చేసింది అమెరికా స్టేట్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్. కాకపోతే, USTR మోపిన ఈ కొత్త టారిఫ్‌లు ఇప్పుడే అమల్లోకి రావు. ఇవి మాకూ ఓకే అని అమెరికన్ సిటిజన్స్ జనవరి 5లోగా రాతపూర్వకంగా అభిప్రాయాలు తెలపాలి. జనవరి 25న...