మరోసారి బయటపడిన ట్రంప్ ద్వంద వైఖరి.. రష్యా-అమెరికా వాణిజ్యంపై పుతిన్ సంచలన ప్రకటన!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో ఏ దేశం వాణిజ్య ఒప్పందం చేసుకోకూడదని.. ఆదేశం నుంచి దిగుమతులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇద్దరు నాయకులు నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడైంది
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో ఏ దేశం వాణిజ్య ఒప్పందం చేసుకోకూడదని.. ఆదేశం నుంచి దిగుమతులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇద్దరు నాయకులు నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి రష్యాతో అమెరికా వాణిజ్యం 20 శాతం పెరిగిందని పుతిన్ చెప్పడం అందరినీ ఆశ్చర్యనాకి గురిచేసింది.ఈ ప్రకటన ట్రంప్ పరిపాలనపై ప్రపంచ వాణిజ్య విధానంలో ద్వంద్వ ప్రమాణాలను స్పష్టంగా చూపిస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో, పుతిన్ చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదం ఉన్నప్పటికీ అమెరికా, రష్యాల మధ్య వాణిజ్యం 20% పెరిగిందని పుతిన్ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వెల్లడించారు.
మరోవైపు వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధంపై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలను వచ్చే 2-3 వారాల్లో మళ్లీ సమీక్షిస్తామని కూడా ఆయన అన్నారు. అయితే, పుతిన్-ట్రంప్ సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ధ్వందవైఖరి విధానం వెల్లడైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.