ట్రేడ్ వార్.. అగ్రరాజ్యంపై బుష్ కొట్టిన డ్రాగన్

| Edited By:

May 14, 2019 | 9:32 AM

అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. తమపై అమెరికా సుంకాలు విధిస్తే.. తాము ధీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా.. అన్నంతపని చేసింది. తాజాగా 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా వస్తువులపై 10, 20, 25 శాతాల పన్నులను పెంచుతున్నట్టు ప్రకటించింది. గతంలో ఐదుశాతంగావున్న సుంకాల్లో ఎలాంటి మార్పులేదు. పెంచిన పన్నులు జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది చైనా. దీంతో అమెరికా తీసుకున్న నిర్ణయాలకు చైనా ధీటుగా బదులిచ్చినట్లైంది. అమెరికాతో […]

ట్రేడ్ వార్.. అగ్రరాజ్యంపై బుష్ కొట్టిన డ్రాగన్
Follow us on

అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. తమపై అమెరికా సుంకాలు విధిస్తే.. తాము ధీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా.. అన్నంతపని చేసింది. తాజాగా 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా వస్తువులపై 10, 20, 25 శాతాల పన్నులను పెంచుతున్నట్టు ప్రకటించింది. గతంలో ఐదుశాతంగావున్న సుంకాల్లో ఎలాంటి మార్పులేదు. పెంచిన పన్నులు జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది చైనా. దీంతో అమెరికా తీసుకున్న నిర్ణయాలకు చైనా ధీటుగా బదులిచ్చినట్లైంది.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన వేళ డ్రాగన్ ధీటైన బదులిచ్చింది. ఇలాంటి ఒత్తిళ్లకు తాము లొంగబోమన్న చైనా విదేశాంగ శాఖ.. తమ హక్కులను కాపాడుకుంటామని తెలిపింది. ఈ వ్యవహారంపై గతవారం ఇరుదేశాల జరిగిన చర్చలు విఫలంకావడంతో 200 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 10 నుంచి 25 శాతానికి సుంకాలను పెంచింది అమెరికా. ఇప్పటికైనా చైనా దిగిరాకుంటే మరో 300 బిలియన్ డాలర్ల దిగుమతులపైనా సుంకాలు పెంచుతామని సూటిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది.

తమ దేశంతో చైనా వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే తీవ్రంగా దెబ్బ తింటుందని స్పష్టంచేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనిపై ప్రతిష్టంభన తొలగించేందుకు సోమవారం ఇరుదేశాల అధ్యక్షులు ఫోన్‌లో చర్చించుకుంటున్నారు. సుంకాలు పెంచినంత మాత్రాన ఎలాంటి సమస్య లేదని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని, విదేశీ ఒత్తిడికి తలొగ్గేదిలేదన్నది చైనా విదేశాంగ చెబుతున్నమాట. సుంకాలు ఏమోగానీ ఇరుదేశాలు దిగుమతి చేసుకున్న వస్తువులపై ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యులు మండిపడుతున్నారు.