Most Dangerous Stairs: స్వర్గానికి దారితీసే ఈ మెట్లు ఎక్కాలంటే ధైర్యం కావాలి.. ! ప్రపంచంలోనే ఇవి అత్యంత భయంకరమైనవి..

|

Dec 14, 2022 | 4:53 PM

ఇది ఒక అద్భుతమైన పర్వతం. ఇది నిటారుగా నిలబడి ఉంటుంది. దీనికి మెట్లు స్వర్గానికి దారితీస్తాయి. ఈ మెట్లు ఎక్కాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. శరీర బరువంతా సైడ్‌ చైన్లకు వేలాడుతూ అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే, మీరు చివరి దశకు చేరుకున్న క్షణం..మీరు ఊహించని విధంగా ఉంటుంది. అది నిజంగానే స్వర్గలోకం.. !

Most Dangerous Stairs: స్వర్గానికి దారితీసే ఈ మెట్లు ఎక్కాలంటే ధైర్యం కావాలి.. ! ప్రపంచంలోనే ఇవి అత్యంత భయంకరమైనవి..
Deadliest Staircasesf
Follow us on

ప్రయాణాలంటే ఆసక్తి ఉన్నవారు సాహసం చేసేవారు కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలను చూడాలంటే చాలా కష్టపడాలి. అలాంటి వారికోసమే ఈ వార్త. ముఖ్యంగా భారతీయులకు మెట్లు ఎక్కడం, దిగడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలోని చాలా పుణ్యక్షేత్రాలు పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి భక్తులు తమ ఇష్ట దైవ దర్శనం కోసం వేలాది మెట్లు ఎక్కుతుంటారు. మెట్లు వెడల్పుగా, నడవడానికి సౌకర్యంగా ఉంటే మంచిది. కానీ కొన్ని మెట్లు ప్రమాదకరమైనవిగా ఉంటాయి. కాస్త అజాగ్రత్తగా ఉన్నామంటే ఇక అంతే సంగతులు. ప్రమాదానికి ఆహ్వానం పలుకుతుంది. ఇలాంటి ప్రమాదకరమైన మెట్లు ప్రపంచంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి.

Angkor Wat Temple Stairs, Cambodia.
అంకోర్ వాట్ ఆలయం కంబోడియాలోని ఒక దేవాలయం. ఇది 162.6 హెక్టార్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం. ఇక్కడ మెట్లు భయానకంగా ఉంటాయి. దీనిని స్వర్గానికి మెట్ల మార్గం అంటారు. 70 శాతం మెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మెట్లు ఎక్కడానికి మళ్లీ దిగాలంటే తాడు సహాయం కావాలి. ఇది విష్ణుమూర్తికి సంబంధిచన అతి పెద్ద దేవాలయం. విష్ణు దర్శనం కావాలంటే మీరు మీ ఇక్కడ కష్టపడాల్సిందే.

Batu Caves
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహం ఉన్న ప్రదేశం ఇది. బటు గుహలు మలేషియాలోని గోంబాక్ జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు సున్నపురాయి కొండపై ఉన్నాయి. ఈ గుహలే కాకుండా ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. బటు నది ఈ కొండ గుండా ప్రవహిస్తుంది. అందుకే దీన్ని బటు గుహలు అంటారు. మురుగన్ విగ్రహాన్ని దర్శించుకోవాలంటే గుహ లోపల 50 మెట్లు ఎక్కాలి.

ఇవి కూడా చదవండి

Statue of Liberty
ప్రతి ఒక్కరూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పేరు వినే ఉంటారు. అమెరికాకు వెళ్లినవారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడకపోతే అసంతృప్తిగా ఉంటుంది. స్వేచ్ఛకు ప్రతిరూపమైన ఈ విగ్రహం.. ఆమెరికాకు ప్రతీకగా నిలిచింది. సంవత్సరమంతా పర్యాటకులతో ఇది రద్దీగానే ఉంటుంది. ఇది న్యూయార్క్ హార్బర్‌లో ఉంది. 305 అడుగుల ఎత్తుతో భారీ రాగి విగ్రహం ఇది. 22 అంతస్తుల విగ్రహం పైకి చేరుకోవడానికి 354 మెట్లు ఎక్కాలి.

Flrli Stairs, Norway. …
నార్వేలోని ఫ్లోరాలి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మెట్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొత్తం 4,444 మెట్లు ఉన్నాయి. వీటి ఎత్తు 2,427 అడుగులు. ఈ మెట్లు రాతితో చేసినవి కావు. ఇవి చెక్కతో చేసిన మెట్లు. ఈ మెట్లు పైకి ఎక్కడం అంటే ఈఫిల్ టవర్‌ను 2 సార్లు కంటే ఎక్కువ ఎక్కినట్లే. ఈ మెట్లు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి.

Mount Huashan, China..
ఇది చైనాలో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణలలో ఒకటి. ఈ దశలను ఇప్పటివరకు ఎవరూ లెక్కించలేకపోయారు. మెట్లు ఎక్కి స్వర్గ దృశ్యాన్ని చూడవచ్చు. హుషాన్ పర్వతం మీద అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి హుషాన్ టీహౌస్. ఇది దక్షిణ శిఖరంపై ఉన్న బౌద్ధ, దావోయిస్ట్ దేవాలయం. ఆలయానికి చేరుకోవడానికి, సందర్శకులు స్వర్గపు మెట్లు పైకి ఎక్కవలసి ఉంటుంది. ఇది చాలా నిటారుగా ఉన్న పర్వతంపై చెక్కబడిన రాతి మెట్ల పొడవైన కాలిబాట.

Haiku Stairs, Oahu, Hawaii. …
హైకూ మెట్లు: వీటిని స్వర్గానికి మెట్లు అని కూడా అంటారు. అవి చెక్కతో తయారు చేయబడ్డాయి. ఇక్కడ మొత్తం 3922 మెట్లు ఉన్నాయి. 1987 తర్వాత ఈ మెట్లు మూసివేయబడ్డాయి. కానీ చాలామంది ఎక్కుతారు. ఇది అమెరికాలో ఉంది.

Taihang Mountains Spiral Staircase, China. …
టెహాంగ్ మెట్లు : తెహాంగ్ మెట్లు చైనాలో ఉన్నాయి. తెహాంగ్ స్టెప్స్ ఎత్తు 300 అడుగులు. మెట్లు ఎక్కాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. అరవై ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కగలరు.

Machu Picchu Peru..
మచు పిక్చు అనేది సముద్ర మట్టానికి 2,430 మీటర్ల (7,970 అడుగులు) ఎత్తునున్న 15 వ శతాబ్దపు ఇంకో ప్రదేశం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ప్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. ఇది 80 కిలోమీటర్ల దూరంలోని (50మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్ర లోయ పైన ఒక పర్వత శిఖరం పైన ఉంది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తున్నది. దీన్నే లాస్ట్ సిటీ ఆఫ్ ది ఇంకాస్ గా సూచిస్తారు. మచు పిచ్చు 1981 లో ఒక పెరువియన్ హిస్టారికల్ అభయారణ్యంగా, 1983 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. 2007 లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్ లో ప్రపంచ న్యూ సెవెన్ వండర్స్ యొక్క ఒకటిగా మచు పిచ్చుకి ఓటింగ్ జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి