ప్రపంచంలో టాప్-10 అత్యంత అవినీతి దేశాలు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే?

Most Corrupt Countries 2025: అవినీతి.. ఇది లేకుండా ప్రభుత్వంలోని ఒక్క శాఖ కూడా పనిచేయదు. చిన్న పని చేయడానికైనా అధికారులకు లంచం ఇవ్వాల్సిందే.. ఇది మన ఒక్క దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ అవినీతి. అయితే ప్రపంచ దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అధ్యయనం చేసి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్-10 అవినీతి దేశాల పేర్లను ప్రస్తావించింది. కాట్టి ఆదేశాలేవో తెలుసుకుందాం పదండి.

ప్రపంచంలో టాప్-10 అత్యంత అవినీతి దేశాలు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే?
Most Corrupt Countries

Updated on: Dec 11, 2025 | 7:06 PM

అవినీతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, ఇది ఆర్థిక వ్యవస్థలను, ప్రజా వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తూ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ తాజాగా 2025లో ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో దక్షి సుడాన్ ఉండగా.. 10వ స్థానంలో ఉత్తర కోరియా ఉంది. వివిధ దేశాల్లోని నిపుణులు, వ్యాపారుల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేసి ఈ సంస్ధ వాటికి స్కోర్‌ను ఇస్తుంది. ఈ సంస్థ మొత్తం 180 దేశాల లిస్టు సిద్ధం చేయగా.. అందులో అత్యంత అవినీతికి పాల్పడిన దేశాలకు సున్నా స్కోరు, అవినీతి లేని దేశాలకు 100 స్కోరు కేటాయిస్తుంది. ఈ జాబితా యుద్ధాలు, రాజకీయ అస్థిరత, బలహీన సంస్థల వల్ల ప్రభావితమైన దేశాలను ప్రతిబింబిస్తుంది.

2024లో ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశంగా దక్షిణ సూడాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా. 9 పాయింట్లతో సోమాలియా రెండో స్థానంలో, వెనిజులా, 10 సిరియా 12 పాయింట్లతో మూడు, నాగులు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం భారత దేశం 180 దేశాల్లో 38 స్కోర్‌తో 96 స్థానంలో కొనసాగుతుంది. అయితే గత నివేదికలతో పోలిస్తే భారత్ స్కోరు కొద్దిగా తగ్గింది. 2023 నివేదికలో భారత్ 38 పాయింట్లు, 2022లో 40 పాయింట్లలో కొనసాగగా.. 2024 రిపోర్టులో భారత్ స్కోరు 38గా నమోదైంది.

అయితే గతంలో పోల్చితే 2024లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అవినీతి స్థాయిలు “చాలా ఎక్కువగా” ఉన్నాయని, కొన్ని దేశాల్లో మాత్రమే పురోగతి కనిపించిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది. 2012 తర్వాత దాదాపు 32 దేశాలు చాలా వరకు మార్పు వచ్చినప్పటికీ.. మిగతా148 దేశాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనబడలేదని ఈ సంస్థ పేర్కొంది.

2025లో టాప్ -10 అవినీతి దేశాల జాబితా

1 సౌత్ సుడాన్

2 .సోమాలియా

3. వెనెజువెలా

4. సిరియా

5. యెమెన్

6. లిబియా

7 .ఎరిట్రియా

8. ఈక్వటోరియల్ గినియా

9. సుడాన్

10. ఉత్తర కొరియా

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us