సాధారణంగా వందేళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70-80 ఏళ్లు బతకడమే గగనమైపోతుంది. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించిన నియమాలు పాటిస్తే ఇన్నేళ్లు బతుకుతారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఎక్కువ కాలం బతకడం లేదు. కానీ ఓ గ్రామంలో మాత్రం అందరి వందేళ్లకుపైగానే బతుకుతున్నారు. ఆ గ్రామంలోని మహిళలు ప్రపంచంలోనే అత్యధిక ఆయుష్సుగలవారే ఉన్నారు. ఎక్కడో అనుకుంటున్నారా..? ఇంగ్లండ్‌లోని డెట్లింగ్-తుర్నాహామ్ గ్రామం. ఆ గ్రామంలో అందరూ దీర్ఘాయుష్కులే.
ఇక్కడ వందేండ్లు బతకడం అనేది చాలా కామన్. గ్రామం రెండు అంశాల్లో ప్రసిద్ది పొందింది. మొదటిది గ్రామస్తులంతా దీర్ఘాయుష్కులు కావడం, రెండోది పురుషులు కన్నా మహిళలు ఎక్కువ కాలం జీవించడం. ఈ గ్రామంలో మహిళలు సగటు ఆయుష్సు 95 ఏళ్లు. కాగా బ్రిటన్‌లోని ప్రజల సగటు ఆయుర్దాయం 83 ఏళ్లు.
డెట్లింగ్-తుర్నాహామ్ గ్రామస్తుల దీర్ఘాయుష్షుకు కారణమేంటి..?
డెట్లింగ్-తుర్నాహామ్ గ్రామస్తుల దీర్ఘాయుష్సుకు కారణమేంటని అందరు ఆశ్చర్యపోతుంటారు. అందుకు కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ గ్రామంలో ఇంట్లో కానీ, బయటకాని పొగతాగడం నిషేధం. వీరి ఆరోగ్య రహస్యంలో ఇదే కీలకమంటున్నారు ఆ గ్రామస్తులు. గ్రామస్తుల దీర్ఘాయువుకు ఇంకో ప్రధానం కారణం ఏంటంటే అనుక్షణం అందుబాటులో ఉన్న వైద్య సేవలు. ఈ గ్రామం సహజ రిజర్వాయర్‌కు సమీపంలో ఉండటంతో అందుబాటులో శుద్ధమైన తాగునీరు లభిస్తుంది. గత ఏడేళ్ల నుంచి పొగ తాగడంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది ఈ గ్రామం. ఇంతకీ ఈ గ్రామంలో జనాభా ఎంతంటే కేవలం 800 మంది మాత్రమే. దేశంలో అత్యధిక వయస్సున్న ప్రజల జాబితాలో డెట్లింగ్ గ్రామాన్ని చేర్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఈ గ్రామస్తులను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. హెయిర్ డ్రెస్సర్ పనిచేస్తున్న ఐరీన్ నోబ్స్ తన 102 జన్మ దినోత్సవాన్ని ఈ ఏప్రిల్ నెలలో జరుపుకొన్నారు.
వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం..
► ప్రపంచ దేశాల ప్రజల సగటు ఆయుర్దాయం 72.74 (73) ఏళ్లు
► పురుషుల సగటు ఆయుర్దాయం 70.8(71) ఏళ్లు
► మహిళల సగటు ఆయుర్దాయం 75.6(76) ఏళ్లు
ప్రపంచంలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా ఉన్న దేశాలు:
► జపాన్ 84 ఏళ్లు.
► మకావ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతం చైనా 84 ఏళ్లు.
► చైనా 77 ఏళ్లు.
► స్విట్జర్లాండ్ 84 ఏళ్లు.
► భారత్‌లో సగటు అయుర్దాయం 69.66 (70) ఏళ్లు.
ఆయా దేశాల్లో 65 ఏళ్లు దాటిన వృద్ధులు:
► తమ జనాభాలో అత్యధిక వృద్ధులను కలిగివున్న టాప్ 5 దేశాలు
1. చైనా – 16.6 కోట్లు
2. భారత్ – 8.5 కోట్లు
3. అమెరికా – 5.3 కోట్లు
4. జపాన్ – 3.6 కోట్లు
5. రష్యా – 2.1 కోట్లు
► ఆయా దేశాల్లో జనాభాతో పోలిస్తే అత్యధికంగా వృద్ధులను కలిగివున్న దేశం జపాన్.
► జపాన్ తన దేశ జనాభాతో పోలిస్తే అత్యధికంగా 28.2 శాతం వృద్ధులను కలిగి ఉంది.
► 22.8 శాతం వృద్ధులతో రెండో స్థానంలో ఇటలీ ఉంది.
► 22.1 శాతం వృద్ధులతో మూడో స్థానంలో జర్మనీ, పోర్చుగల్, గ్రీస్‌లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: