Economic crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం(Financial crisis) గురించి వార్తల్లో నిలుస్తుండగా.. ప్రపంచంలో మరో మూడు దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో నేపాల్, సోమాలియా, చిలీ దేశాలు ఉన్నాయి. భారత్ కు సమీపంలోని నేపాల్ పరిస్థితి చూసుకుంటే.. ఫిబ్రవరి 2022కు ముందు నుంచి విదేశీ కరెన్సీ నిల్వలు(Forex Reserves) 16 శాతం మేర పడిపోయి.. 9.59 బిలియన్ డాలర్లకు చేరుకోవటంతో అప్రమత్తమైంది. కార్లు, సౌంధర్య సాధనాలు, బంగారం వంటి లగ్జరీ వస్తువుల దిగుమతిపై నేపాల్ ఆంక్షలు విధించింది. నేపాల్ జీడిపీలో అప్పులు 43 శాతానికి పెరగడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) (CPN-UML) సభ్యులు బిష్ణు పౌడెల్, సురేంద్ర పాండే, డాక్టర్ యుబరాజ్ ఖతివాడా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని పేర్కొన్నారు.
దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని కరువును సోమాలియా ప్రస్తుతం ఎదుర్కొంటోదంని నిపుణుల నివేధికలు చెబుతున్నాయి. ఈ ఏడాది వేసవిలోగా చర్యలు చేపట్టకపోతే.. దేశంలోని తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న 1.4 మిలియన్ల మందిలో.. 3.5 లక్షల మంది పిల్లలు మరణిస్తారని యునైటెడ్ నేషన్ హెచ్చరించింది. UN ప్రకారం దాదాపు 7 లక్షల మంది ప్రజలు తమకు, తమ పెంపుడు జంతువులకు ఆహారం, నీరు కోసం తమ ఇళ్లను వీడి వలసలు వెళ్లారు. అక్టోబర్ 2020 నుంచి వరుసగా మూడు వర్షాకాలాలు నిరాశను మిగల్చడంతో పంటలు నాశనమయ్యాయి. మూగ జీవాలు కూడా దీని కారణంగా భారీగానే మరణించాయి.
ఇలాంటి సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న మరో దేశం చిలీ. చిలీ కరువు రికార్డు స్థాయిలో 13వ సంవత్సరంలోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగోకి రేషన్ పద్ధతిలో నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికను ప్రకటించింది. దేశంలో నీటి లభ్యత గత 30 ఏళ్లలో 37%కి పడిపోయిందని, 2060 నాటికి ఉత్తర, మధ్య చిలీలో మరో 50% తగ్గవచ్చని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
ఇవీ చదవండి..
Indian Railways: రైల్వే ప్రయాణికులకు పెద్ద ఉపశమనం.. కీలక ప్రకటన చేసిన ఇండియన్ రైల్వే శాఖ..!
Maternity Insurance: మెటర్నిటీ ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ చేసుకోండి.. పూర్తి వివరాలు..