Crotalaria Cunninghami: ఆకుపచ్చ హమ్మింగ్‌బర్డ్‌లా కనిపించే పువ్వులు ఎక్కడ ఉన్నాయో తెలుసా.. వీటిని ఔషదంగా ఉపయోగించే ఆదివాసీలు

|

Apr 08, 2022 | 11:31 AM

Crotalaria Cunninghami: ప్రకృతి ఎన్నో వింతలకు నిలయం. ఒక చెట్టు పువ్వులు అందమైన పక్షుల ఆకారంలో ఉన్నాయనే సంగతి అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు.. అవును అందమైన పక్షులు హమ్మింగ్ బర్డ్స్..

Crotalaria Cunninghami: ఆకుపచ్చ హమ్మింగ్‌బర్డ్‌లా కనిపించే పువ్వులు ఎక్కడ ఉన్నాయో తెలుసా.. వీటిని ఔషదంగా ఉపయోగించే ఆదివాసీలు
Crotalaria Cunninghamii
Follow us on

Crotalaria Cunninghami: ప్రకృతి ఎన్నో వింతలకు నిలయం. ఒక చెట్టు పువ్వులు అందమైన పక్షుల ఆకారంలో ఉన్నాయనే సంగతి అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు.. అవును అందమైన పక్షులు హమ్మింగ్ బర్డ్స్ ( Hummingbirds) . ఇవి చాలా చిన్నవి. అయితే హమ్మింగ్ బర్డ్స్ అంత అందంగా హమ్మింగ్‌బర్డ్ ఆకారపు పువ్వుల ఆకారంలో ఉన్న మొక్కలు భూమి మీద ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చే ఈ మొక్కలను ఆకుపచ్చ బర్డ్‌ఫ్లవర్ , రెగల్ బర్డ్‌ఫ్లవర్ (Birdflower Ratulpo), చిలుక బఠానీ( Parrot Pea) వంటి పేర్లతో పిలుస్తారు. ఈ అద్భుతమైన మొక్క చిక్కుళ్ళు కుటుంబానికి చెందినది. ఈ మొక్క శాస్త్రీయ పేరు  క్రోటలేరియా కన్నింగ్‌హమీ. 19వ శతాబ్దానికి చెందిన వృక్షశాస్త్రజ్ఞుడు అలన్ కన్నింగ్‌హామ్ పేరుతో వీటిని పిలుస్తారు.

ఆకుపచ్చ బర్డ్ ఫ్లవర్ ఆకుపచ్చ పొదలా పెరుగుతుంది. దీని స్వస్థలం ఉత్తర ఆస్ట్రేలియా. పొద జాతికి చెందిన ఈ మొక్క  తొమ్మిది అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. మబ్బు, బూడిద-ఆకుపచ్చ రంగుల ఆకులను కలిగి ఉంటుంది. దీని పక్షి లాంటి పువ్వుల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంతరం ఈ మొక్కకు జనాదరణ పెరిగిందని ఆస్ట్రేలియన్ నేటివ్ ప్లాంట్స్ సొసైటీ  తెలిపింది. అంతేకాదు ఈ మొక్కలో ఔషధ గుణాలున్నాయని చెప్పారు. ఆదిమవాసులు తరచుగా కంటి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి మొక్కల రసాన్ని ఉపయోగిస్తారని చెప్పారు.

ఈ మొత్తం మొక్కను నేరుగా చూస్తే, ఒక డజను పచ్చని హమ్మింగ్‌బర్డ్‌లు ఒకచోట గుమికూడి పూల మకరందాన్ని ఆస్వాదించినట్లు అనిపిస్తుంది. గాలికి అందంగా ఊగుతున్నప్పుడు మరింత అందంగా ఉంటుంది. వీటి పువ్వులను చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం అంటున్నారు.

పచ్చని బర్డ్ ఫ్లవర్ సాధారణంగా ఇసుక తిన్నెలలో ,ముల్గా కమ్యూనిటీలలో కనిపిస్తుంది. సూర్యరశ్మి పుష్కలంగా ఉండే ఇసుక, బాగా ఎండిపోయిన నేలలో వేడి వాతావరణంలో ఈ మొక్క పెరుగుతుంది. వీటి స్వస్థలం ఆస్ట్రేలియా అయినప్పటికీ యుఎస్ లోని కొన్ని ప్రాంతాల్లో వీటిని పెంచుతున్నారు. దక్షిణ కాలిఫోర్నియా, సదరన్ ఫ్లోరిడా, హవాయిలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఆకుపచ్చ బర్డ్ ఫ్లవర్ మొక్కలు కనిపిస్తాయి.

ఈ హమ్మింగ్‌బర్డ్ ఆకారపు పువ్వులు ఆస్ట్రేలియా నుండి వచ్చినప్పటికీ..  మొక్కల ప్రేమికులు Amazon లో విత్తనాలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. వేసవి సీజన్ లో ఈ మొక్క పుష్పిస్తుంది.

Read Also: Watch Video: బావిలో పడిన చిరుత.. చాకచక్యంగా కాపాడిన రెస్క్యూ బృందం.. నెట్టింట వీడియో వైరల్

Turumala Hundi: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. మార్చి నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం..