కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..ఆ రోజు ఏం జరిగిందంటే?

2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖైదా తీవ్రవాదులు విమానాలను హైజాక్ చేసి వాటితో చేసిన దాడులకు అమెరికాలో 3 వేల మంది మరణించారు. దాంతో ఆ రోజు ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా మూసివేశారు ఆ సంక్షోభ సమయంలో ఒక సామాన్యుడి కోసం అధికారులు కదిలిన తీరు, జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ను గుర్తుచేసుకుందాం.

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..ఆ రోజు ఏం జరిగిందంటే?
Plane Carried Antivenom For A Snakebite Victim

Updated on: Sep 09, 2026 | 9:32 PM

 

స్నేక్ హ్యాండ్లర్ గా ఎంతో అనుభవం ఉన్న లారెన్స్ వాన్ సెర్టిమా జీవితం ఆ రోజు  పీడకలలా మారింది. 2001 సెప్టెంబర్ 11న విషపూరిత ‘ఇన్లాండ్ టైపాన్’ పామును దాని ఎన్‌క్లోజర్‌లోకి (బోనులో) తిరిగి పంపే ప్రయత్నం చేస్తుండగా..  అతని బొటనవేలును కాటేసింది.  పరిస్థితి నిముషాల్లో సీరియస్ గా మారి కళ్లు, చెవులు, నోటి నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. స్పృహ కోల్పోయి మృత్యువుతో పోరాడాడు లారెన్స్ వాన్ సెర్టిమా.

ప్రాణాపాయంలో స్నేక్ బైట్ బాధితుడు

 

లారెన్స్ వాన్ సెర్టిమా కు సాధారణ యాంటీ వీనమ్ పని చేయదు, ‘ఇన్‌లాండ్ టైపాన్’ యాంటీ వీనమ్ మాత్రమే కావాలి. కానీ ఆ మందు అప్పట్లో అమెరికాలో కేవలం న్యూయార్క్, శాన్‌డిగో జూలలో మాత్రమే అందుబాటులో ఉంది. అదే రోజు 9/11 దాడులు జరగడంతో న్యూయార్క్ సిటీ మొత్తం భయానక వాతావరణంతో నిండిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో డాక్టర్ల టీమ్ శాన్‌డిగో జూపై దృష్టి పెట్టారు. మెడికల్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి ఫ్లైట్ పర్మిషన్ కోసం పట్టుబట్టారు. హై-లెవెల్ చర్చలు జరిపిన తర్వాత ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఫైనల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది!

ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ మధ్య ఆకాశంలో ఎగిరిన  విమానం

2001 సెప్టెంబర్ 11న అమెరికా గగనతలం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ, శాన్‌ డిగో నుంచి ఒక చిన్న విమానం గాల్లోకి లేచింది. ఆ విమానం అమెరికా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు భద్రతా కారణాల రీత్యా  రెండు ఆర్మీ ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్‌గా పక్కనే వచ్చాయి!  శాన్‌ డిగో నుంచి అత్యవసరంగా తీసుకొచ్చిన ఆ అరుదైన యాంటీవెనమ్‌ను మయామి హాస్పిటల్‌కు చేర్చగానే డాక్టర్లు వెంటనే వాన్ సెర్టిమాకు ఎక్కించారు. ఆ మందు పనిచేయడంతో అతను క్రమంగా కోలుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.

 అనంతరం ఒక టీవీ షోలో మాట్లాడుతూ అతను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఆ పాముదేం తప్పు లేదు, దాన్ని డీల్ చేయడంలో నా నిర్లక్ష్యమే ఆ యాక్సిడెంట్‌కి కారణం” అంటూ ఆ పాముపై ఎలాంటి కోపం లేకుండా తన తప్పును పెద్ద మనసుతో ఒప్పుకున్నాడు. దేశం మొత్తం టెర్రర్ ఎటాక్ టెన్షన్‌లో ఉన్న ఆ సంక్షోభ సమయంలోనూ, ఒక సాధారణ మనిషి ప్రాణం కోసం జరిగిన రెస్క్యూ ఆపరేషన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది!

 

Loading...
Unable to load recommendations.
Follow Us