Iran vs Israel War: ఉద్రిక్తతలు తగ్గించాలని ఇరాన్‌-ఇజ్రాయెల్‌కు G-7 కూటమి పిలుపు..

Iran - Israel War: పశ్చిమాసియా రగులుతోంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య వరుసగా ఐదోరోజు పరస్పరం దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. వారి కుటుంబాలు తమ పిల్లలను క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు.

Iran vs Israel War: ఉద్రిక్తతలు తగ్గించాలని ఇరాన్‌-ఇజ్రాయెల్‌కు G-7 కూటమి పిలుపు..
Iran Israel War

Updated on: Jun 17, 2025 | 1:05 PM

Iran vs Israel War: ఉద్రిక్తతలు తగ్గించాలని ఇరాన్‌-ఇజ్రాయెల్‌కు G-7 పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వాలకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌కు స్వీరక్షణ హక్కు ఉందని, ఆ దేశ భద్రతకు మా మద్దతు ఉంటుందని G-7 పిలుపునిచ్చింది. ప్రాంతీయ అస్థిరతకు, ఉగ్రవాదానికి ఇరాన్‌ కేంద్రబిందువన్న G-7. ఇరాన్‌ దగ్గర అణ్వస్త్ర ఆయుధాలు ఉండకూడదన్న G-7 కూటమి. గాజాలో కాల్పుల విరమణకు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణతోపాటు ఇరాన్‌ సంక్షోభ పరిష్కారం తోడ్పడతుందన్న G-7 కూటమి.

ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. వారి కుటుంబాలు తమ పిల్లలను క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు. మరోవైపు ఇరాన్‌లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో వారిని సురక్షితంగా తరలించేందుకు భారత్ చేసిన విజ్ఞప్తికి ఇరాన్ స్పందించింది. భూ సరిహద్దులు తెరిచి ఉన్నాయని, రాయబార కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అటు భూమార్గంలో వారిని ఆఫ్గనిస్తాన్‌ , టుర్కిమెనిస్తాన్‌ , అజర్‌బైజాన్‌ దేశాల మీదుగా భారత్‌కు తరలించడానికి ప్రయత్నిస్తోంది.

కాగా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌ కకావికలమైంది. కాల్పుల విరమణకు, అణ్వస్త్ర చర్చలకు ఇరాన్‌ ఆఫర్‌ చేసింది. ఈ క్రమంలో గల్ఫ్‌ దేశాలతో ఇరాన్‌ లాబీయింగ్‌ చేస్తోంది. ట్రంప్‌పై ఒత్తిడికి తెచ్చేందుకు ఇరాన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖతార్‌, సౌదీ అరేబియా, ఒమన్‌ దేశాలతో సంప్రదింపులు చేసింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్‌ కోరింది. అదే విధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని అరబ్‌ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో జీ7 ట్రిప్‌ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు తిరిగొస్తున్నారు. వచ్చీరాగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. యుద్ధం నేపథ్యంలో టెహ్రాన్‌లో ఉన్న పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే ట్రంప్‌ హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. అవసరమైతే అమెరికా కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..