NASA: అంతరిక్షం నుంచి మొదటి సారి మాట్లాడిన సునీత.. ఎన్నికల్లో అక్కడ నుంచే ఓటు వేయడానికి ప్లాన్..!

|

Sep 14, 2024 | 11:26 AM

అంతరిక్ష నౌక తిరిగి నాసా వ్యోమగాములు లేకుండా భూమి మీదకు వచ్చిన తర్వాత తొలిసారిగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను అందరి ముందు వెల్లడించారు. ఇద్దరు వ్యోమగాములు తాము లేకుండా బోయింగ్ స్టార్‌లైనర్ భూమికి తిరిగి వెళ్ళడం తమకు చాలా బాధని కలిగించింది అని చెప్పారు.

NASA: అంతరిక్షం నుంచి మొదటి సారి మాట్లాడిన సునీత.. ఎన్నికల్లో అక్కడ నుంచే ఓటు వేయడానికి ప్లాన్..!
Sunita Williams
Image Credit source: NASA
Follow us on

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 3 నెలలకు పైగా అంతరిక్షంలోనే చిక్కుకుని ఉన్నారు. మరోవైపు ఈ ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్టార్‌లైనర్ అనే స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడు వీరిద్దరూ లేకుండానే భూమి మీదకు తిరిగొచ్చింది. ఈ నేపధ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు అంతరిక్షం నుంచి తమ మొదటి ప్రకటన చేశారు. తాము భూమి మీదకు తిరిగి వచ్చే తదుపరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

అంతరిక్ష నౌక తిరిగి నాసా వ్యోమగాములు లేకుండా భూమి మీదకు వచ్చిన తర్వాత తొలిసారిగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను అందరి ముందు వెల్లడించారు. ఇద్దరు వ్యోమగాములు తాము లేకుండా బోయింగ్ స్టార్‌లైనర్ భూమికి తిరిగి వెళ్ళడం తమకు చాలా బాధని కలిగించింది అని చెప్పారు.

వ్యోమగాములు ఇరిద్దరూ ఏం చెప్పారంటే

బుచ్ విల్మోర్ మాట్లాడుతూ తాము లేకుండా మనం లేకుండా అంతరిక్ష నౌక తిరిగి భూమి మీదకు చేరుకోవాలని తాము కోరుకోలేదని అయితే అది జరిగిపోయింది. తాము లేకుండా వెళ్ళిపోయిందని చెప్పారు. ఈ సందర్భంగా సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. తాము ఆశని వదులుకోలేదని.. ఇప్పుడు తాము నెక్స్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ మిషన్‌లో సాంకేతిక లోపాల కారణంగా మీరు ఇద్దరూ అంతరిక్షంలో చిక్కుకున్నారు.. కనుక బోయింగ్ , నాసాపై కోపంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సునీత టీ-షర్టుపై ఉన్న నాసా లోగోను చూపిస్తూ అది తప్పని స్పష్టంగా ఖండించారు. మనం దేని కోసం నిలబడతామో.. ఆ పంథాలో ముందుకు సాగుతాము.. అప్పుడే మనం అసాధారణమైన పనులను చేయగలమని చెప్పారు.

“మేము దీనికి సిద్ధంగా ఉన్నాము”

ఈ మిషన్ 8 రోజుల నుంచి 8 నెలల వరకు పొడిగించ బడింది. దీని కారణంగా ఇప్పటికే 3 నెలల నుంచి అంతరిక్షంలోనే ఉన్నారు.. మరో 5 నెలలు అంతరిక్షంలో ఉండవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఇద్దరూ మాట్లాడుతూ తాము ఇందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బుచ్ విల్మోర్ మాట్లాడుతూ 8 రోజుల ప్రయాణం నుంచి 8 నెలలకు సాగినా తాము తమ ఉత్తమమైన ప్రదర్శన అందిస్తామని చెప్పారు.

ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఓటు వేయడానికి ప్లాన్

నవంబర్ 5న అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయంపై సునీత, బుచ్ విల్మోర్ స్పందిస్తూ.. తాము అంతరిక్షం నుండి ఓటు వేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు సునీతా విలియమ్స్ చిరునవ్వుతో అంతరిక్షం నుండి ఓటు వేస్తే ఎంత భిన్నంగా ఉంటుందో అంటూ కామెంట్ చేశారు.

ఇప్పుడు వీళ్లిద్దరూ తిరిగి ఎలా వస్తారంటే

స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకుని వచ్చే మిషన్ పదేపదే వాయిదా పడుతోంది. NASA ఆగస్ట్ 24న సునీతా విలియమ్స్ , విల్మోర్ క్రూ 9 మిషన్‌లో భాగమవుతారని.. ఫిబ్రవరి 2025లో SpaceX , K డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా 8 నెలల తర్వాత తిరిగి భూమి మీదకు తిరిగి వస్తారని వెల్లడించింది. ఇంతలో స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక సిబ్బంది లేకుండా తిరిగి వచ్చింది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..