Global Safety Summit: గ్లోబల్‌ సస్టైనబిలిటీ లీడర్‌ అవార్డు అందుకున్న మైహోమ్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాము రావు

|

Sep 14, 2024 | 12:07 PM

బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ నిర్వహించిన గ్లోబల్‌ సేఫ్టీ సమిట్‌లో 2024 నిర్మాణ రంగానికి సంబంధించి మైహోమ్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాము - గ్లోబల్‌ సస్టైనబిలిటీ లీడర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. 2024 సంవత్సరపు సురక్షిత ఆరోగ్య పర్యావరణ అంతర్జాతీయ అవార్డుకు మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎంపికైంది.

Global Safety Summit: గ్లోబల్‌ సస్టైనబిలిటీ లీడర్‌ అవార్డు అందుకున్న మైహోమ్‌ గ్రూప్‌ కన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాము రావు
My Home Constructions Private Limited Vice Chairman Ramu Rao
Follow us on

గ్లోబల్ సేఫ్టీ సమ్మిట్.. 2024 ఈవెంట్.. ఈ ఏడాది లండన్‌లోని యూకే పార్లమెంట్‌ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సెప్టెంబర్ 13న జరిగింది. ఇదే వేదికపై ఈఎస్‌జీ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వివిధ విభాగాల్లో ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ అందజేశారు. అయితే ఇంటర్నేషనల్ సస్టేయెనబులిటీ అవార్డ్(కన్‌స్ట్రక్షన్ విభాగం) మైం హోమ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌.. ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావును వరించింది. దీంతో మై హోం గ్రూప్ మరో మైల్ స్టోన్ సాధించినట్లు అయింది. ఆ సంస్థకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మై హోం గ్రూప్ ఎన్నో సెక్టార్స్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అంతేకాదు మై హోమ్‌ గ్రూప్‌ హెల్త్‌ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్‌ హెడ్‌ డి.భాస్కరరాజు ఇంటర్నేషనల్‌ బెస్ట్‌ HSE మేనేజర్‌ అవార్డు గెలుచుకున్నారు. మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గడిచిన మూడేళ్లుగా వరుసగా ప్రఖ్యాత అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంటోంది. పర్యావరణం, ఆరోగ్యం, భద్రత, కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీస్ తదితర విభాగాల్లో పరిశ్రమలు సాధించిన విజయాలను గ్లోబల్ సేఫ్టీ సమ్మిట్ అవార్డు అందజేస్తుంది.

Dantuluri Bhaskar Raju

గ్లోబల్ సేఫ్టీ సమ్మిట్ (GSS) అనేది ఫైర్ అండ్ సేఫ్టీ ఫోరమ్ ద్వారా నిర్వహించబడే వార్షిక సమావేశం. దీన్ని 2009లో స్థాపించారు. ఇది భారతదేశంలోని మొదటి అంతర్జాతీయ సర్టిఫికేషన్ & అసెస్‌మెంట్ బాడీ. ఇది అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్, యునైటెడ్ స్టేట్స్ ప్రకారం సర్టిఫికేషన్ గైడ్‌లైన్స్ డెవలప్ చేస్తుంది. ఫైర్ అండ్ సేఫ్టీ ఫోరమ్ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ న్యూయార్క్‌కు జవాబుదారీగా ఉంటుంది. ఇది భారతదేశంలోని నెట్‌వర్క్ (UNGCNI)తో యాక్టివ్ అసోసియేషన్‌లో ఉంది.

2014 నుండి, ప్రతి సంవత్సరం గ్లోబల్ సేఫ్టీ సమ్మిట్.. ఇండియాలో 1000కు పైగా భద్రతా నిపుణులు, 40 మందికి పైగా ప్రముఖ వ్యాఖ్యాతలు, 30 మందికి పైగా పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేస్తుంది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా, UNGCNI భాగస్వామ్యంతో GSS 2020 వర్చువల్‌గా నిర్వహించారు. అవార్డు విజేతల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్స్ ఇండియన్ పోర్టల్‌లో ప్రచురించారు.

అవార్డు గెలిచిన సందర్భంలో.. హోమ్‌ గ్రూప్‌ హెల్త్‌ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్‌ హెడ్‌ డి.భాస్కరరాజు  ఏం మాట్లాడారో దిగువన చూడండి… 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..